రాహుల్ గాంధీకి కోర్టు జరిమానా.. ఏ కేసులో ఈ ఆదేశాలు అంటే..?

రాహుల్ గాంధీకి కోర్టు జరిమానా.. ఏ కేసులో ఈ ఆదేశాలు అంటే..?

లక్నో: కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి లక్నో కోర్టు జరిమానా విధించింది. ఓ కేసుకు సంబంధించి విచారణకు హాజరు కాకపోవడంతో రూ.200 ఫైన్ విధించింది. తదుపరి విచారణకు తప్పకుండా హాజరు కావాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది కోర్టు. 

అసలు కేసు ఏంటంటే..?

మహారాష్ట్రలో ఓ ఎన్నికల ర్యాలీ సందర్భంగా ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు వీర్ సావర్కర్‎పై రాహుల్ గాంధీ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. రాహుల్ వ్యాఖ్యలపై ప్రముఖ న్యాయవాది నృపేంద్ర పాండే లక్నో కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాహుల్ గాంధీ చరిత్రను వక్రీకరించి.. వీర్ సావర్కర్ గౌరవానికి భంగం వాటిల్లేలా మాట్లాడారని.. ఈ మేరకు అతడిపై చర్యలు తీసుకోవాలని న్యాయస్థానాన్ని కోరాడు. ఈ పిటిషన్‎పై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. 2025, మార్చి 5న విచారణకు హాజరు కావాలని రాహుల్‎కు నోటీసులు జారీ చేసింది. ముందస్తు షెడ్యూల్ వల్ల రాహుల్ గాంధీ బుధవారం (మార్చి 5) విచారణకు గైర్హాజరయ్యారు. 

ALSO READ | మా కల ఇండియా.. బీజేపీ కల హిందియా.. కేంద్రంపై కమల్ హాసన్ ఫైర్

రాహుల్ గాంధీ తరుఫున ఆయన న్యాయవాది కోర్టుకు హాజరయ్యారు. ముందస్తు షెడ్యూల్‎లో భాగంగా  రాహుల్ గాంధీ ఒక విదేశీ ప్రముఖుడితో బుధవారం (మార్చి 5) భేటీ కావాల్సిన ఉందని.. ఈ నేపథ్యంలోనే ఆయన కోర్టు విచారణకు హాజరు కాలేదని న్యాయవాదికి తెలిపారు. ఇవాళ్టి విచారణకు రాహుల్ కు మినహాయింపు ఇవ్వాలని  న్యాయస్థానాన్ని కోరారు. రాహుల్ న్యాయవాది అభ్యర్థనను తిరస్కరించిన కోర్టు.. విచారణకు హాజరుకాకపోవడంతో రాహుల్ గాంధీకి రూ.200 జరిమానా విధిస్తూ.. కేసు తదుపరి విచారణను 2025, ఏప్రిల్ 14కు వాయిదా వేసింది. నెక్ట్స్ హియరింగ్‎కు తప్పకుండా హాజరు కావాలని రాహుల్ గాంధీని ఆదేశాలు జారీ చేసింది.