
లక్నో: కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరో వివాదంలో చిక్కుకున్నారు. 2022 డిసెంబర్‌లో భారత్ జోడో యాత్ర సందర్భంగా భారత సైన్యాన్ని అవమానపర్చేలా రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేశారని ఆర్వోబీ మాజీ డైరెక్టర్ ఉదయ్ శంకర్ శ్రీవాస్తవ కోర్టును ఆశ్రయించారు. ఉదయ్ శంకర్ తరుఫున న్యాయవాది వివేక్ తివారీ లక్నో కోర్టులో రాహుల్ గాంధీపై పరువు నష్టం దావా వేశారు.
ALSO READ | పని చేయాలంటే ఇష్టపడట్లే.. ఉచితాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం
రాహుల్ గాంధీ వ్యాఖ్యలు, ప్రకటనలు భారత సైన్యాన్ని అవమానపర్చే విధంగా ఉన్నాయని.. అతడిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ దావాపై లక్నో కోర్టు బుధవారం ( ఫిబ్రవరి 12) విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఎంపీ రాహుల్ గాంధీకి న్యాయస్థానం సమన్లు జారీ చేసింది. ఈ కేసు విచారణకు సంబంధించి 2025, మార్చి 24న స్వయంగా కోర్టుకు హాజరు కావాలని రాహల్ గాంధీని ఆదేశించింది కోర్టు.