LSG vs MI: మార్ష్, మార్కరం మెరుపులు.. ముంబై ముందు బిగ్ టార్గెట్

LSG vs MI: మార్ష్, మార్కరం మెరుపులు.. ముంబై ముందు బిగ్ టార్గెట్

ఐపీఎల్ 2025లో మరో భారీ స్కోర్ నమోదయింది. ఏకనా క్రికెట్ స్టేడియంలో ముంబై ఇండియన్స్‎తో జరుగుతున్న మ్యాచ్‎లో లక్నో సూపర్ జయింట్స్ భారీ స్కోర్ చేసింది. మార్ష్ మెరుపులకు తోడు మార్కరం హాఫ్ సెంచరీతో ముంబై ముందు టఫ్ టార్గెట్ పెట్టింది. ఈ మ్యాచ్‎లో మొదట బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 పరుగుల భారీ స్కోర్ చేసింది. 

ఈ మ్యాచులో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన లక్నో ఇన్నింగ్స్‎ను దూకుడుగా ఆరంభించింది. ఓపెనర్లు మార్ష్, మార్కరం తొలి వికెట్‎కు 70 పరుగులు జోడించి శుభారంభం ఇచ్చారు. ముఖ్యంగా మార్ష్ పవర్ ప్లేలో ముంబై బౌలర్ల భరతం పట్టాడు. వరుస బౌండరీలతో హోరెత్తించి 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 

పవర్ ప్లే తర్వాత మార్ష్ 60, పూరన్ 12 ఔట్ అయ్యారు. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్  రిషబ్ పంత్ తన పేలవ ఫామ్‎ను ఈ మ్యాచులోనూ కంటిన్యూ చేశాడు. ఆరు బంతులు ఆడిన పంత్ కేవలం 2 పరుగులే చేసి హార్ధిక్ పాండ్యా బౌలింగ్లో క్యాచ్ ఔట్ అయ్యాడు. ఈ దశలో మార్కరం, బదోని జట్టును ఆదుకున్నారు. నాలుగో వికెట్‎కు 51 పరుగులు జోడించి జట్టును భారీ స్కోర్ దిశగా తీసుకెళ్లారు. మార్కరం 34 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 

వేగంగ ఆడే క్రమంలో మార్కరం 53, బదోని 30 పరుగులు చేసి ఔట్ అయ్యారు. చివర్లో డేవిడ్ మిల్లర్ (27) చెలరేగి ఆడటంతో లక్నో 200 పరుగుల మార్క్‎ను దాటింది. ముంబై 204 పరుగుల లక్ష్యంతో ఛేజింగ్‎కు దిగింది. ముంబై బౌలర్లలో హార్దిక్ పాండ్య 5 వికెట్లు పడగొట్టాడు. అశ్వని కుమార్, విగ్నేష్ కుమార్, బౌల్ట్ తలో ఒక వికెట్ తీసుకున్నారు.