- కేఎల్ రాహుల్ సెంచరీ మిస్
- అర్థసెంచరీలతో జట్టును అలవోకగా గెలిపించిన కేఎల్ రాహుల్,డికాక్
- రెండు వికెట్లు కోల్పోయి మరో ఓవర్ మిగిలి ఉండగానే లక్నో సూపర్ జైంట్స్ విక్టరీ
IPL 2024: లక్నో, చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ విక్టరీ సాధించింది. 177 పరుగుల విజయలక్ష్యంగా బరిలోకి దిగిన లక్నో ఆటగాళ్లు.. రెండు వికెట్లు కోల్పోయి 19 ఓవర్ల లో విజయలక్ష్యాన్ని ఈజీగా ఛేదించారు. ఓపెనర్లుగా వచ్చిన కేఎల్ రాహుల్, డికాక్ అద్భుతమైన బ్యాటింగ్ తో జట్టును విజయ పథంలో నడిపించారు. చెన్నై ఇచ్చిన టార్గెట్ ఛేదించడంలో కీలక పాత్ర పోషించారు. కేఎల్ రాహుల్ 53 బంతుల్లో 82 ,డికాక్ 54 పరుగులతో రాణించారు. ముస్తాఫఇజుర్, పతిరన చెరో వికెట్ తీశారు.
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న లక్నో జట్లు చెన్నై జట్టుని బ్యాటింగ్ అప్పజెప్పింది. ఈ మ్యాచ్ లో చెన్నై జట్టు భారీ స్కోర్ చేసింది. చివరి ఓవర్లో ధోనీ(28) మెరవడంతో నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన చెన్నై జట్టుకు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. ఓపెనర్ రచిన్(0) డకౌటయ్యాడు. ఆ తరువాత కాసేపటికే కెప్టెన్ రుతురాజ్(17) ఔటయ్యాడు. దీంతో నిలకడగా ఆడుతూ రహానె (36), జడేజా(54*) నిలకడగా ఆడుతూ జట్టు స్కోర్ పెంచారు.
ఈ క్రమంలోనే కృనాల్ చెన్నైకు బిగ్ షాకిచ్చాడు. రహానెను క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తరువాత క్రీజ్ లోకి వచ్చిన శివమ్ దూబె(3) కూడా నిరాశపరిచాడు. స్టాయినిస్ వేసిన 12 ఓవర్లో రాహుల్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ఆ వెంటనే రిజ్వీ(1) రూపంలో చెన్నై ఐదో వికెట్ కోల్పోయింది. దీంతో 98 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి చెన్నై పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ క్రమంలో జడేజాకు తోడుగా మొయిన్ అలీ(30) జోరు చూపించాడు.
also read : బ్యాట్ ఝళిపించిన జడేజా, ధోనీ.. చెన్నై భారీ స్కోర్
ఇద్దరు కలిసి జట్టు స్కోర్ ను 150 పరుగులు దాటించారు. రవి వేసిన 18వ ఓవర్లో వరుసగా 3 సిక్సులు కొట్టిన మొయిన్ అలీ ఆ తరువాత మరో షాట్ ఆడే ప్రయత్నంలో బదోనీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఇక చివర్లో బ్యాటింగ్ కు వచ్చిన ధోనీ బ్యాట్ ఝళిపించాడు. ఏకంగా 9 బంతుల్లో 28 పరుగులు చేశాడు. ఇందులో 2 సిక్సర్లు, 3 ఫోర్లు ఉన్నాయి. లక్నో బౌలర్లలో కృనాల్ 2 వికెట్లు పడగొట్టగా.. మోసిన్, యశ్, రవి, స్టాయినిస్ తలో వికెట్ తీశారు.