LSG vs GT: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న లక్నో.. తుది జట్టు నుంచి మార్ష్ ఔట్!

LSG vs GT: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న లక్నో.. తుది జట్టు నుంచి మార్ష్ ఔట్!

ఐపీఎల్ 2025 లో శనివారం (ఏప్రిల్ 12) రెండు మ్యాచ్ లు జరగనున్నాయి. ఇందులో భాగంగా మధ్యాహ్నం జరగబోయే తొలి మ్యాచ్ లక్నో సూపర్ జయింట్స్ తో గుజరాత్ టైటాన్స్ తలపడనుంది. లక్నోలోని ఏకనా క్రికెట్ స్టేడియంలో స్టేడియంలో ప్రారంభమైన ఈ మ్యాచ్ లో ఆతిధ్య లక్నో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటివరకు లక్నో ఆడిన 5 మ్యాచ్ ల్లో మూడు విజయాలు సాధించగా.. గుజరాత్ ఆడిన 5 మ్యాచ్ ల్లో నాలుగు మ్యాచ్ ల్లో గెలిచి టేబుల్ టాపర్ గా కొనసాగుతుంది. 

ఈ మ్యాచ్ లో లక్నో ఒక మార్పుతో బరిలోకి దిగుతుంది. మిచెల్ మార్ష్ స్థానంలో హిమ్మత్ సింగ్ తుది జట్టులోకి వచ్చాడు. మరోవైపు గుజరాత్ టైటాన్స్ జట్టులో కుల్వంత్ ఖేజ్రోలియా స్థానంలో వాషింగ్ టన్ సుందర్ ప్లేయింగ్ 11 లోకి వచ్చాడు. 

గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI):

సాయి సుదర్శన్, శుభమన్ గిల్(కెప్టెన్), జోస్ బట్లర్(వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, షెర్ఫానే రూథర్‌ఫోర్డ్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, అర్షద్ ఖాన్, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, మహ్మద్ సిరాజ్

లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI):
 
ఐడెన్ మార్క్రామ్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్(కెప్టెన్, వికెట్ కీపర్), హిమ్మత్ సింగ్, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, శార్దూల్ ఠాకూర్, ఆకాష్ దీప్, దిగ్వేష్ సింగ్ రాఠీ, అవేష్ ఖాన్, రవి బిష్ణోయ్

►ALSO READ | టెస్ట్ మ్యాచ్ రిహారల్స్ మాదిరిగా CSK పవర్ ప్లే బ్యాటింగ్.. ధోనీ సేన పరువు తీసిన మాజీ క్రికెటర్