
సొంతగడ్డపై ఎలాగైనా గెలిచి ప్లే ఆప్స్ ఆశలు సజీవంగా ఉంచుకుందామనుకున్న రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ లో విఫలమైంది. శనివారం (ఏప్రిల్ 19) లక్నో సూపర్ జయింట్స్ ని ఒక మాదిరి స్కోర్ కే పరిమితం చేసేలా కనిపించినా చివరి ఓవర్లో సందీప్ శర్మ 27 పరుగులు ఇవ్వడంతో లక్నో భారీ స్కోర్ చేసింది. జైపూర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన లక్నో.. మార్కరం (45 బంతుల్లో 66:5 ఫోర్లు, 3 సిక్సర్లు), బదోనీ (50) హాఫ్ సెంచరీలతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. రాజస్థాన్ బౌలర్లలో హసరంగా రెండు వికెట్లు తీసుకున్నాడు. ఆర్చర్, సందీప్ శర్మ, దేశ్ పాండే తలో వికెట్ తీసుకున్నారు.
ఈ మ్యాచ్ లో లక్నో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ తీసుకుంది. ఆరంభంలోనే ఓపెనర్ మిచెల్ మార్ష్ నాలుగు పరుగులు చేసి ఆర్చర్ బౌలింగ్ లో ఔటయ్యాడు. టాప్ ఫామ్ లో ఉన్న సందీప్ శర్మ.. నికోలస్ పూరన్ (11) ను ఔట్ చేసి బిగ్ రిలీఫ్ ఇచ్చాడు. ఆ తర్వాత కెప్టెన్ రిషబ్ పంత్ రివర్స్ స్వీప్ ఆడి మూడు పరుగులే చేసి పెవిలియన్ కు చేరాడు. పంత్ ఔట్ కావడంతో లక్నో 54 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో లక్నోని ఓపెనర్ మార్కరం, బదోనీ ఆదుకున్నారు. కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును పటిష్ట స్థితికి చేర్చారు.
మొదటి 9 ఓవర్లలో 63 పరుగులే చేసి లక్నో.. మార్కరం, బదోనీ బ్యాట్ ఝులిపించడంతో ఆ తర్వాత నాలుగు ఓవర్లలోనే 48 పరుగులు చేయడం విశేషం. నాలుగో వికెట్ కు 76 పరుగులు జోడించిన తర్వాత స్కోర్ వేగాన్ని పెంచే క్రమంలో భారీ షాట్ కు ప్రయత్నించి మార్కరం ఔటయ్యాడు. 16 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిన మార్కరం 45 బంతుల్లో 66 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్ 5 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. కాసేపటికే హాఫ్ సెంచరీ చేసిన బదోనీ పెవిలియన్ బాట పట్టాడు. చివరి ఓవర్లో సమద్ (10 బంతుల్లోనే 30: నాలుగు సిక్సర్లు) ఏకంగా నాలుగు సిక్సర్లు బాదడంతో లక్నో 180 పరుగుల మార్క్ చేరుకుంది.
27 RUNS in the final over take LSG to 180 🔥#RRvLSG SCORECARD 👉 https://t.co/IsM16mvHzB pic.twitter.com/xV1LYwgQeA
— ESPNcricinfo (@ESPNcricinfo) April 19, 2025