LSG vs DC: బ్యాటింగ్‌లో లక్నో ఫ్లాప్ షో.. ఢిల్లీ ముందు ఈజీ టార్గెట్!

LSG vs DC: బ్యాటింగ్‌లో లక్నో ఫ్లాప్ షో.. ఢిల్లీ ముందు ఈజీ టార్గెట్!

ఏకనా క్రికెట్ స్టేడియంలో మంగళవారం (ఏప్రిల్ 22) ఢిల్లీ క్యాపిటల్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో లక్నో సూపర్ జయింట్స్ బ్యాటింగ్ లో తీవ్రంగా నిరాశపరిచింది. తొలి 10 ఓవర్లలో అద్భుతంగా ఆడిన లక్నో.. చివరి 10 ఓవర్లలో చెత్తగా ఆడింది. మార్కరం(33 బంతుల్లో 52:2 ఫోర్లు, 3 సిక్సర్లు), మార్ష్(45) ఇచ్చిన సూపర్ స్టార్ట్ ను వినియోగించుకోలేక ఒక మాదిరి స్కోర్ కే పరిమితమైంది. ఢిల్లీ క్యాపిటల్స్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగుల స్కోర్ మాత్రమే చేయగలిగింది. ఢిల్లీ బౌలర్లలో ముకేశ్ కుమార్ మూడు వికెట్లు తీసుకున్నాడు. స్టార్క్, చమీరాలకు తలో వికెట్ దక్కింది.             

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన లక్నో సూపర్ జయింట్స్ కు ఓపెనర్లు మార్కరం, మార్ష్ అదిరిపోయే ఆరంభం ఇచ్చారు. మార్ష్ పరుగులు చేయడానికి కాస్త ఇబ్బందిపడినా.. మరో ఎండ్ లో మార్కరం చూడ చక్కని షాట్లతో  అలరించాడు. స్టార్క్, ముకేశ్ కుమార్ బౌలింగ్ లో సిక్సర్ కొట్టి జట్టుకు మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు. ఓపెనర్ల ధాటికి లక్నో పవర్ ప్లే లో  వికెట్ కోల్పోకుండా 51 పరుగులు చేసింది. తొలి 6 ఓవర్ల తర్వాత మార్కరం తో మార్ష్ కూడా బ్యాట్ ఝులిపించడంతో తొలి 10 ఓవర్లలో 89 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది. 

►ALSO READ | LSG vs DC: ఇంతకన్నా బ్యూటిఫుల్ షాట్ చూస్తామా: రాహుల్‌ను మెప్పించిన మార్కరం క్లాసికల్ సిక్సర్

హాఫ్ సెంచరీ పూర్తి చేసుకొని మంచి ఊపు మీదున్న మార్కరం.. 10 ఓవర్ చివరి బంతిని చమీర బౌలింగ్ లో ఔటయ్యాడు. ఆ వెంటనే అద్భుతమైన బంతితో పూరన్ (9) ను స్టార్క్ బౌల్డ్ చేశాడు. 14 ఓవర్లో ముకేశ్ కుమార్ చావు దెబ్బ తీశాడు. ఈ ఓవర్లో అబ్దుల్ సమద్(2), మిచెల్ మార్ష్ (45) లను పెవిలియన్ కు పంపి లక్నోని కష్టాల్లో పడేశాడు. మిల్లర్, బదోనీ ప్రారంభంలో పరుగులు చేయడానికి బాగా ఇబ్బంది పడ్డారు. ఢిల్లీ బౌలర్ల ధాటికి వీరు వేగంగా ఆడడంలో విఫలమయ్యారు. బదోనీ (36) పర్వాలేదనిపించినా మిల్లర్ నిరాశపరిచాడు.