
ఐపీఎల్ లో మంగళవారం (ఏప్రిల్ 8) మధ్యాహ్నం జరిగిన మ్యాచ్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ పై లక్నో సూపర్ జయింట్స్ థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన హై స్కోరింగ్ మ్యాచ్ లో 4 పరుగుల తేడాతో గెలిచి ఊపిరి పీల్చుకుంది. భారీ ఛేజింగ్ లో కేకేఆర్ కెప్టెన్ రహానే (35 బంతుల్లో 61:8 ఫోర్లు, 2 సిక్సర్లు) పోరాడినప్పటికీ కీలక సమయంలో లక్నో బౌలర్లు వికెట్లు తీసి మ్యాచ్ గెలిచారు. మొదట బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 238 పరుగుల భారీ స్కోర్ చేసింది. లక్ష్య ఛేదనలో కోల్‌కతా నైట్ రైడర్స్ 7 వికెట్లను 234 పరుగులు చేసి ఓడిపోయింది.
239 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్ ఆరంభం నుంచి ధాటిగా ఆడింది. తొలి ఓవర్ లోనే 15 పరుగులు రాబట్టింది. నరైన్, రహానే, డికాక్ మెరుపులతో పవర్ ప్లే లో ఏకంగా 90 పరుగులు చేసింది. డికాక్ 9 బంతుల్లో 15 పరుగులు చేసి ఔట్ కాగా.. నరైన్ 13 బంతుల్లో 30 పరుగులు చేసి లక్నోని వణికించాడు. నరైన్ ఔటైనా కేకేఆర్ ను కెప్టెన్ రహానే, వెంకటేష్ అయ్యర్ అద్భుతంగా నడిపించారు. ఓవర్ కు 10 పరుగులు కొడుతూ భారీ భాస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో రహానే 30 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసుకొని జట్టును విజయంపై నడిపించాడు.
Also Read : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్
7 ఓవర్లలో 77 పరుగులు చేయాల్సిన దశలో రహానే ఔట్ కావడంతో కోల్‌కతా ఒక్కసారిగా కుప్పకూలింది. ఆ తర్వాత వెంటనే రఘువంశీ, రమణ్ దీప్ సింగ్ పెవిలియన్ కు చేరారు. ఆండ్రీ రస్సెల్, వెంకటేష్ అయ్యర్ పెవిలియన్ బాట పట్టడంతో కేకేఆర్ ఓటమి దిశగా పయనించింది. చివర్లో రింకూ సింగ్ పోరాడినప్పటికీ విజయానికి 4 పరుగుల దూరంలో నిలిచిపోయింది. లక్నో బౌలర్లలో ఆకాష్ దీప్, శార్దూల్ ఠాకూర్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. అవేశ్ ఖాన్, దిగ్వేశ్, బిష్ణోయ్ తలో వికెట్ పడగొట్టారు.
అంతకముందు మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జయింట్స్ బ్యాటింగ్ లో దుమ్ము లేపింది. వచ్చిన వారు వచ్చినట్టు చెలరేగడంతో భారీ స్కోర్ చేసింది. ఓపెనర్లు ఇచ్చిన సూపర్ స్టార్ట్ కు పూరన్(36 బంతుల్లో 87: 7 ఫోర్లు, 8 సిక్సర్లు) విధ్వంసకర ఆటతో లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 238 పరుగుల భారీ స్కోర్ చేసింది. పూరన్ 36 బంతుల్లో 87 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. కోల్‌కతా బౌలర్లలో హర్షిత్ రాణా రెండు వికెట్లు తీసుకున్నాడు. రస్సెల్ కు ఒక వికెట్ దక్కింది.
LSG come out on top in a run-fest at Eden Gardens!https://t.co/FWVeLOdPKJ | #KKRvLSG pic.twitter.com/ogKbIsDpct
— ESPNcricinfo (@ESPNcricinfo) April 8, 2025