
ఉప్పల్ లో సన్ రైజర్స్ కు ఈ సారి నిరాశే మిగిలింది. గురువారం (మార్చి 27) లక్నో సూపర్ జయింట్స్ పై 5 వికెట్ల తేడాతో పరాజయం పాలయింది. బ్యాటింగ్ లో పర్వాలేదనిపించినా.. బౌలర్లందరూ ఘోరంగా విఫలం కావడంతో ఓటమి తప్పలేదు. మరో వైపు అన్ని విభాగాల్లో సమిష్టిగా రాణించిన లక్నో సూపర్ జయింట్స్ సన్ రైజర్స్ ను చిత్తు చేసి ఈ సీజన్ లో తొలి విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది.
పూరన్ ( 26 బంతుల్లో 70: 6 ఫోర్లు, 6 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ కు తోడు మిచెల్ మార్ష్ (52) హాఫ్ సెంచరీతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో లక్నో సూపర్ జయింట్స్ 16.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేసి గెలిచింది.
191 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్ జయింట్స్ కు ఆరంభంలోనే షాక్ తగిలింది. పేలవ ఫామ్ కొనసాగిస్తూ ఒక పరుగుకే వెనుదిరిగాడు. షమీ వేసిన బంతికి కవర్స్ దిశగా షాట్ ఆడాలని చూసిన మార్కరం కమ్మిన్స్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. మూడో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన మిల్లర్ మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కుదురుకోవడానికి సమయం తీసుకోకుండా ఆరంభం నుంచే ఎదురు దాడికి దిగాడు. మరో ఎండ్ లో మిచెల్ మార్ష్ కూడా బ్యాట్ ఝుళిపించడంతో పవర్ ప్లే లో 77 పరుగులు చేసింది. 3,4, 5 ఓవర్లలో వరుసగా 17, 18,17 పరుగులు వచ్చాయి.
పవర్ ప్లే తర్వాత కూడా పూరన్, మార్ష్ తమ బ్యాట్ కు పని చెప్పారు. ముఖ్యంగా పూరన్ సన్ రైజర్స్ బౌలర్లను చితక్కొట్టాడు. ఈ క్రమంలో కేవలం 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ విండీస్ వీరుడి ధాటికి వార్ వన్ సైడ్ గా మారింది. స్వల్ప వ్యవధిలో పూరన్ మార్ష్, పంత్ (15), బదోనీ (6) లను ఔట్ చేసినా అప్పటికే సన్ రైజర్స్ కు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సన్ రైజర్స్ బౌలర్లలో కమ్మిన్స్ రెండు వికెట్లు పడగొట్టాడు. షమీ, జంపా, హర్షల్ పటేల్ కు తలో వికెట్ దక్కింది.
Also Read : సిక్సర్లతో దుమ్ములేపిన కమ్మిన్స్
అంతకముందు సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. హెడ్ (47), నితీష్ కుమార్ రెడ్డి (32) యంగ్ బ్యాటర్ అనికేత్ వర్మ (36) రాణించగా.. మిగితా బ్యాటర్లు విఫలం అయ్యారు. స్టార్ బ్యాటర్ క్లాసెన్ 26 పరుగులతో పర్వాలేదనిపించాడు. చివర్లో యంగ్ బ్యాటర్ అనికేత్ వర్మ 13 బంతుల్లో 5 సిక్సుర్లు బాది మెరుపు ఇన్సింగ్స్ ఆడగా.. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ 4 బంతుల్లో 3 సిక్సర్లు కొట్టి 18 పరుగులు చేశాడు.
హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరుగుతోన్న ఈ మ్యాచులో సన్ రైజర్స్ టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగింది. లీగ్ తొలి మ్యాచులో భారీ స్కోర్ చేయడంతో ఈ మ్యాచులో కూడా ఎస్ఆర్హెచ్పై హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు ఫ్యాన్స్. ఈ మ్యాచులో 190 పరుగుల భారీ స్కోరే చేసినప్పటికీ.. అభిమానులు అంచనాలను మాత్రం రీచ్ కాలేదు.
LSG move past their 2024 nightmare and get a big W in Hyderabad ✅ #SRHvLSG scorecard 👉 https://t.co/GuPiDpGwnY pic.twitter.com/r0pt9DPg1p
— ESPNcricinfo (@ESPNcricinfo) March 27, 2025