LSG vs GT: మార్కరం ధనాధన్.. పూరన్ ఫటా ఫట్: భారీ స్కోర్ చేసి లక్నో చేతిలో ఓడిన గుజరాత్

LSG vs GT: మార్కరం ధనాధన్.. పూరన్ ఫటా ఫట్: భారీ స్కోర్ చేసి లక్నో చేతిలో ఓడిన గుజరాత్

ఐపీఎల్ 2025 లో లక్నో సూపర్ జయింట్స్ తమ సూపర్ ఫామ్ కొనసాగిస్తోంది. శనివారం (ఏప్రిల్ 12) సొంతగడ్డపై గుజరాత్ టైటాన్స్ పై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సొంతగడ్డపై గెలిచి 8 పాయింట్లతో పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరుకుంది. మొదట బౌలర్లు పెద్దగా రాణించకపోయినా.. ఛేజింగ్ లో మార్కరం(31 బంతుల్లో 58:9 ఫోర్లు, సిక్సర్), పూరన్(34 బంతుల్లో 61: ఫోర్, 7 సిక్సర్లు)   దడదడలాడించారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 180 పరుగుల స్కోర్ చేసింది. ఛేజింగ్ లో లక్నో సూపర్ జయింట్స్ 19.3 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసి గెలిచింది. 

181 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో లక్నోకి సూపర్ స్టార్ అందింది. అనూహ్యంగా ఈ మ్యాచ్ లో ఓపెనర్ గా వచ్చిన పంత్, మార్కరంతో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించాడు. పంత్ పరుగులు చేయడానికి ఇబ్బంది పడినప్పటికీ మరో ఎండ్ లో మార్కరం బౌండరీల వర్షం కురిపించాడు. తొలి వికెట్ కు 6.2 ఓవర్లలో 65 పరుగులు జోడించిన తర్వాత 21 పరుగులు చేసిన పంత్ ఔటయ్యాడు. ఈ దశలో మార్కరంకు జత కలిసిన పూరన్ చెలరేగాడు. శరవేగంగా పరుగులు చేస్తూ ఏ దశలోనూ గుజరాత్ కు అవకాశం ఇవ్వలేదు. ఇద్దరూ హాఫ్ సెంచరీలు చేసుకొని జట్టును పటిష్ట స్థితికి చేర్చి ఔటయ్యారు. చివరి ఓవర్లో బదోని ఒత్తిడి తట్టుకొని లక్నోని గెలిపించాడు. 

►ALSO READ | SRH vs PBKS: కీలక మ్యాచ్‌లో టాస్ ఓడిన సన్ రైజర్స్.. పంజాబ్ బ్యాటింగ్

గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ కృష్ణ రెండు వికెట్లు తీసుకున్నాడు. సుందర్, రషీద్ ఖాన్ లకు తలో వికెట్ లభించింది. అంతకముందు మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. ఓపెనర్లు శుభమాన్ గిల్ (38 బంతుల్లో 60: 6 ఫోర్లు, సిక్సర్),  సాయి సుదర్శన్ (37 బంతుల్లో 56: 7 ఫోర్లు, సిక్సర్) హాఫ్ సెంచరీలతో జట్టు భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించారు. లక్నో బౌలర్లలో శార్దూల్, రవి బిష్ణోయ్ రెండు వికెట్లు తీసుకున్నాడు. దిగ్వేశ్, ఆవేశ్ ఖాన్ లకు తలో వికెట్ దక్కింది.