
ఐపీఎల్ 2025లో ఆదివారం (ఏప్రిల్ 27) రెండు మ్యాచ్ లు అభిమానులను అలరించనున్నాయి. ఇందులో భాగంగా లక్నో సూపర్ జయింట్స్, ముంబైగా ఇండియన్స్ మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. వాంఖడే వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ లో లక్నో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఇరు జట్లు ఆడిన 9 మ్యాచ్ ల్లో 5 విజయాలు సాధించాయి. నేడు ఏ జట్టు గెలిచినా ఆరో విజయం తమ ఖాతాలో వేసుకుంటుంది.
ఈ కీలక పోరులో లక్నో ఒక మార్పుతో బరిలోకి దిగుతుంది. శార్దూల్ ఠాకూర్ స్థానంలో మయాంక్ యాదవ్ జట్టులోకి వచ్చాడు. మరో వైపు ముంబై ఈ మ్యాచ్ లో రెండు మార్పులతో బరిలోకి దిగుతుంది. విగ్నేష్ పుత్తూరు స్థానంలో కరణ్ శర్మ.. మిచెల్ సాంట్నర్ స్థానంలో కార్బిన్ బాష్ ప్లేయింగ్ 11 లో చోటు దక్కించుకున్నారు.
ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI):
ర్యాన్ రికెల్టన్ (వికెట్ కీపర్), రోహిత్ శర్మ, విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), నమన్ ధీర్, కార్బిన్ బాష్, ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్, కర్ణ్ శర్మ
లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI):
ఐడెన్ మార్క్రామ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్(కెప్టెన్, వికెట్ కీపర్), అబ్దుల్ సమద్, ఆయుష్ బడోని, దిగ్వేష్ సింగ్ రాఠీ, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్
►ALSO READ | ఈ సారి కూడా పంజాబ్ IPL ట్రోఫీ గెలవదు.. కారణం రికీ పాంటింగే: మనోజ్ తివారీ