SRH vs LSG: ఉప్పల్ లో మ్యాచ్.. టాస్ గెలిచిన లక్నో.. సన్ రైజర్స్ బ్యాటింగ్

SRH vs LSG: ఉప్పల్ లో మ్యాచ్.. టాస్ గెలిచిన లక్నో.. సన్ రైజర్స్ బ్యాటింగ్

ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ గురువారం (మార్చి 27) లక్నో సూపర్ జయింట్స్ తో మ్యాచ్ ఆడబోతుంది. ఉప్పల్ వేదికగా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ప్రారంభమైన ఈ మ్యాచ్ లో లక్నో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇరు జట్లకు ఇది టోర్నీలో రెండో మ్యాచ్.. తొలి మ్యాచ్ లో గెలిచిన జోష్ లో సన్ రైజర్స్ ఉంటే.. లక్నో తమ ప్రారంభ మ్యాచ్ లో ఓడిపోయింది. లక్నో ఈ మ్యాచ్ లో ఒక మార్పుతో బరిలోకి దిగుతుంది. షాబాజ్ అహ్మద్ స్థానంలో ఆవేశ్ ఖాన్ తుది జట్టులో వచ్చాడు. మరోవైపు సన్ రైజర్స్ ప్లేయింగ్ 11 లో ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతుంది. 

సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI):

అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, పాట్ కమిన్స్ (కెప్టెన్), సిమర్జీత్ సింగ్, హర్షల్ పటేల్, మహమ్మద్ షమీ

లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): 

ఐడెన్ మార్క్‌రామ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్(కెప్టెన్, వికెట్ కీపర్), డేవిడ్ మిల్లర్, ఆయుష్ బడోని, శార్దూల్ ఠాకూర్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, దిగ్వేష్ రాఠీ, ప్రిన్స్ యాదవ్