- 21 రన్స్ తేడాతో పంజాబ్ కింగ్స్‌పై గెలుపు
- చెలరేగిన డికాక్, పూరన్, మయాంక్
- పోరాడిన ధవన్, బెయిర్‌స్టో
లక్నో : ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన లక్నో సూపర్‌జెయింట్స్ ఐపీఎల్–17లో బోణీ కొట్టింది. బ్యాటింగ్‌లో క్వింటన్ డికాక్ (54), నికోలస్ పూరన్ (42), క్రునాల్ పాండ్యా (43*) చెలరేగడంతో.. శనివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో 21 రన్స్ తేడాతో పంజాబ్ కింగ్స్‌ను ఓడించింది. టాస్ నెగ్గిన లక్నో 20 ఓవర్లలో 199/8 స్కోరు చేసింది. తర్వాత పంజాబ్ 20 ఓవర్లలో 178/5 స్కోరుకే పరిమితమైంది. శిఖర్ ధవన్ (70), బెయిర్‌స్టో (42) మినహా మిగతా వారు ఫెయిలయ్యారు. లివింగ్‌స్టోన్ (28*) కాసేపు పోరాడాడు. మయాంక్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
ముగ్గురు ఆడిన్రు..
ముందుగా బ్యాటింగ్‌కు దిగిన లక్నోకు ఆరంభంలో డికాక్, మధ్యలో పూరన్, చివర్లో క్రునాల్ పాండ్యా భారీ స్కోరు అందించారు. ఆరంభంలో చకచకా వికెట్లు తీసిన పంజాబ్ బౌలర్లు మ్యాచ్ మధ్యలో పట్టు వదిలేయడంతో భారీ టార్గెట్ నిర్దేశించారు. తొలి రెండు ఓవర్లలో డికాక్, రాహుల్ (15) 12 రన్సే చేశారు. 3వ ఓవర్‌లో డికాక్ 4, 6 కొట్టగా, తర్వాతి ఓవర్‌లో 6, 4 కొట్టిన రాహుల్.. అర్ష్‌దీప్ (2/30)కు వికెట్ ఇచ్చాడు. పడిక్కల్ (9) రెండు ఫోర్లతో జోరు చూపెట్టినా, ఆరో ఓవర్‌లో సామ్ కరణ్ (3/28) సూపర్ డెలివరీకి ఔటయ్యాడు. డికాక్ సిక్స్‌తో పవర్‌ప్లేలో లక్నో 54/2 స్కోరు చేసింది. ఈ దశలో వచ్చిన స్టోయినిస్ (19) కాస్త టైమ్ తీసుకున్నాడు.
దాంతో రెండు ఓవర్లలో 11 రన్సే వచ్చాయి. 9వ ఓవర్‌లో స్టోయినిస్ రెండు సిక్స్‌లు కొట్టి వెనుదిరిగాడు. డికాక్ నిలకడతో తొలి 10 ఓవర్లలో లక్నో 88/3 స్కోరు చేసింది. డికాక్‌తో కలిసిన పూరన్ బ్యాట్ ఝుళిపించాడు. వరుసగా 4. 6, 4, 6 దంచాడు. 13వ ఓవర్‌లో ఫోర్‌తో 34 బాల్స్‌లో ఫిఫ్టీ పూర్తి చేసిన డికాక్ తర్వాతి ఓవర్‌లో ఔటయ్యాడు. దీంతో నాలుగో వికెట్‌కు 47 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది. పూరన్ 4, 4, 6తో 15 ఓవర్లలో స్కోరు 146/4కు పెరిగింది.
కానీ 16వ ఓవర్ ఫస్ట్ బాల్‌కు పూరన్ వికెట్ పడటంతో క్రునాల్ క్రీజులోకి వచ్చాడు. సిక్స్‌తో ఖాతా తెరిచిన అతను 4, 4, 6, 4తో రెచ్చిపోయాడు. 19వ ఓవర్‌లో వరుస బాల్స్‌లో ఆయూష్ బదోని (8), రవి బిష్ణోయ్ (0), తర్వాత మోషిన్ ఖాన్ (0) ఔటయ్యారు. క్రునాల్, బదోని ఆరో వికెట్‌కు 43 రన్స్ జోడించారు. చివరి 5 ఓవర్లలో 53 రన్స్ వచ్చాయి.
ఓపెనర్లు అదుర్స్
భారీ టార్గెట్ ఛేదనను ఓపెనర్లు శిఖర్ ధవన్, బెయిర్‌స్టో ధాటిగా ఆరంభించారు. ధవన్ ఫోర్‌తో ఖాతా తెరిస్తే బెయిర్‌స్టో రెండు ఫోర్లు కొట్టాడు. 3వ ఓవర్ శిఖర్ 4, 4, 6తో 16, ఆరో ఓవర్‌లో 4, 4, 6తో 16 రన్స్ రాబట్టాడు. మధ్యలో బెయిర్‌స్టో సిక్స్ కొట్టడంతో పవర్‌ప్లేలో పంజాబ్ 61/0 స్కోరు చేసింది. ఫీల్డింగ్ పెరిగిన తర్వాత కూడా ఈ ఇద్దరి జోరు తగ్గలేదు. సింగిల్స్‌తో పాటు చెత్త బాల్స్‌ను సిక్సర్లుగా మలిచారు. దీంతో తర్వాతి నాలుగు ఓవర్లలో 39 రన్స్ రావడంతో ఫస్ట్ టెన్‌లో పంజాబ్ స్కోరు 98/0కి పెరిగింది. ఈ క్రమంలో ధవన్ 30 బాల్స్‌లో ఫిఫ్టీ పూర్తి చేశాడు.
11వ ఓవర్‌లో బిష్ణోయ్ మూడే రన్స్ ఇచ్చి కాస్త కట్టడి చేశాడు. ఈ ఒత్తిడిని అధిగమించేందుకు 12వ ఓవర్‌లో బెయిర్‌స్టో భారీ షాట్‌కు యత్నించి స్టోయినిస్‌కు క్యాచ్ ఇచ్చాడు. ఫస్ట్ వికెట్‌కు 102 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది. ప్రభుసిమ్రన్ సింగ్ (19) రెండు సిక్స్‌లు, ఓ ఫోర్ కొట్టినా ఎక్కువసేపు నిలవలేకపోయాడు. 15 ఓవర్లలో పంజాబ్ 136/2 స్కోరు చేసింది. మరో 9 బాల్స్ తర్వాత జితేశ్ శర్మ (6) వెనుదిరిగాడు.
కానీ 17వ ఓవర్‌లో మోషిన్ ఖాన్ (2/34) డబుల్ స్ట్రోక్ ఇచ్చాడు. వరుస బాల్స్‌లో శిఖర్, సామ్ కరణ్ (0)ను పెవిలియన్‌కు పంపడంతో పంజాబ్ 141/5తో కష్టాల్లో పడింది. ఇక శశాంక్ సింగ్ (9*), లివింగ్‌స్టోన్ చేసిన పోరాటం సరిపోలేదు. లాస్ట్ ఓవర్‌లో లివింగ్‌స్టోన్ 6, 4, 6, కొట్టినా చివరి 5 ఓవర్లలో అవసరమైన 64 రన్స్‌ను సాధించలేకపోయింది.
సంక్షిప్త స్కోర్లు
లక్నో : 20 ఓవర్లలో 199/8 (డికాక్ 54, క్రునాల్ పాండ్యా 43*, సామ్ కరణ్ 3/28).
పంజాబ్ : 20 ఓవర్లలో 178/5 (ధవన్ 70, బెయిర్‌స్టో 42, మయాంక్ 3/27).