యశ్​ పాంచ్‌‌‌‌..లక్నో సూపర్‌‌‌‌జెయింట్స్‌‌‌‌ హ్యాట్రిక్‌‌‌‌

యశ్​ పాంచ్‌‌‌‌..లక్నో సూపర్‌‌‌‌జెయింట్స్‌‌‌‌ హ్యాట్రిక్‌‌‌‌
  •     33 రన్స్‌‌‌‌ తేడాతో గుజరాత్‌‌‌‌పై లక్నో గెలుపు

లక్నో: ఐపీఎల్‌‌‌‌లో లక్నో సూపర్‌‌‌‌జెయింట్స్‌‌‌‌ హ్యాట్రిక్‌‌‌‌ విజయాలను అందుకుంది. యశ్​ ఠాకూర్‌‌‌‌ (5/30) పేస్‌‌‌‌ దెబ్బకు క్రునాల్‌‌‌‌ పాండ్యా (3/11) స్పిన్‌‌‌‌ తోడవడంతో.. ఆదివారం జరిగిన లీగ్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లో 33 రన్స్‌‌‌‌ తేడాతో గుజరాత్‌‌‌‌ టైటాన్స్‌‌‌‌ను ఓడించింది. టాస్‌‌‌‌ నెగ్గిన లక్నో 20 ఓవర్లలో 163/5 స్కోరు చేసింది. మార్కస్‌‌‌‌ స్టోయినిస్‌‌‌‌ (43 బాల్స్‌‌‌‌లో 4 ఫోర్లు, 2 సిక్స్‌‌‌‌లతో 58) హాఫ్‌‌‌‌ సెంచరీ చేయగా, కేఎల్‌‌‌‌ రాహుల్‌‌‌‌ (31 బాల్స్‌‌‌‌లో 3 ఫోర్లతో 33), నికోలస్‌‌‌‌ పూరన్‌‌‌‌ (22 బాల్స్‌‌‌‌లో 3 సిక్స్‌‌‌‌లతో 32) రాణించారు. 18/2 స్కోరుతో కష్టాల్లో పడిన లక్నోను స్టోయినిస్‌‌‌‌, పూరన్‌‌‌‌ మూడో వికెట్‌‌‌‌కు 73 రన్స్‌‌‌‌ జోడించి ఆదుకున్నారు. 

ఆ తర్వాత పూరన్‌‌‌‌ కీలక ఇన్నింగ్స్‌‌‌‌ ఆడాడు. స్టోయినిస్‌‌‌‌తో నాలుగో వికెట్‌‌‌‌కు 21 రన్స్‌‌‌‌ జోడించిన అతను.. ఆయూష్‌‌‌‌ బదోనీ (20)తో ఐదో వికెట్‌‌‌‌కు 31 రన్స్‌‌‌‌ జత చేశాడు. చివర్లో మూడు సిక్స్‌‌‌‌లతో జోష్‌‌‌‌ పెంచిన పూరన్‌‌‌‌.. క్రునాల్‌‌‌‌ (2నాటౌట్​)తో ఆరో వికెట్‌‌‌‌కు 20 రన్స్‌‌‌‌ జోడించాడు. ఉమేశ్‌‌‌‌, ధర్శన్‌‌‌‌ నల్కండే చెరో రెండు వికెట్లు తీశారు. ఛేజింగ్‌లో గుజరాత్‌‌‌‌ 18.5 ఓవర్లలో 130 రన్స్‌‌‌‌కే ఆలౌటైంది. సాయి సుదర్శన్‌‌‌‌ (31) టాప్‌‌‌‌ స్కోరర్‌‌‌‌. రాహుల్‌‌‌‌ తెవాటియా (30), కెప్టెన్‌‌‌‌ శుభ్‌‌‌‌మన్‌‌‌‌ గిల్‌‌‌‌ (19) కాసేపు పోరాడారు.

 యశ్, క్రునాల్‌‌‌‌ కీలక విరామాల్లో వికెట్లు తీసి జీటీ స్కోరు బోర్డును అడ్డుకున్నారు. విజయ్‌‌‌‌ శంకర్‌‌‌‌ (17), ధర్శన్‌‌‌‌ (18), కేన్ విలియమ్సన్‌‌‌‌ (1), శరత్‌‌‌‌ (2), రషీద్‌‌‌‌ (0), ఉమేశ్‌‌‌‌ (2), నూర్‌‌‌‌ అహ్మద్‌‌‌‌ (4) నిరాశపర్చడంతో జీటీకి ఓటమి తప్పలేదు. యశ్​కు ‘ప్లేయర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌’ అవార్డు లభించింది.