
ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో లక్నో సూపర్ జయింట్స్ బ్యాటింగ్ లో దుమ్ము లేపింది. వచ్చిన వారు వచ్చినట్టు చెలరేగడంతో భారీ స్కోర్ చేసింది. ఓపెనర్లు ఇచ్చిన సూపర్ స్టార్ట్ కు పూరన్(36 బంతుల్లో 87: 7 ఫోర్లు, 8 సిక్సర్లు) విధ్వంసకర ఆటతో లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 238 పరుగుల భారీ స్కోర్ చేసింది. పూరన్ 36 బంతుల్లో 87 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. కోల్‌కతా బౌలర్లలో హర్షిత్ రాణా రెండు వికెట్లు తీసుకున్నాడు. రస్సెల్ కు ఒక వికెట్ దక్కింది.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన లక్నో సూపర్ జయింట్స్ కు ఓపెనర్లు మార్కరం, మార్ష్( 48 బంతుల్లో 81: 6 ఫోర్లు, 5 సిక్సర్లు) అదిరిపోయే ఆరంభం ఇచ్చారు. తొలి వికెట్ కు 10.2 ఓవర్లలోనే 99 పరుగులు జోడించారు. 47 పరుగులు చేసిన మార్కరంను వైభవ్ స్లో బంతితో ఔట్ చేశాడు. ఈ దశలో క్రీజ్ లోకి వచ్చిన పూరన్, మార్ష్ తో కేకేఆర్ బౌలర్లకు చుక్కలు చూపించారు. హాఫ్ సెంచరీ ఊపు మీదున్న మార్ష్ బౌండరీల వరద పారిస్తుంటే.. మరో ఎండ్ లో మరో ఎండ్ లో నేను తగ్గనంటూ పూరన్ చెలరేగిపోయాడు. 81 పరుగులు చేసి మార్ష్ ఔటైనా.. పూరన్ విధ్వంసం ఆగలేదు.
Also Read:-105 నిమిషాల పాటు ముంబై ఇన్నింగ్స్.. పటిదార్‌కు రూ.12 లక్షల జరిమానా
21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసుకొని ఆ తర్వాత మరింత రెచ్చిపోయాడు. రస్సెల్ వేసిన 18 ఓవర్లో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 24 పరుగులు రాబట్టాడు. అబ్దుల్ సమద్ తో 50 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పితే ఇందులో సమద్ కేవలం 3 బంతులు మాత్రమే ఆడడం గమనార్హం. పూరన్ ధాటికి లక్నో చివరి 5 ఓవర్లకు 68 పరుగులు చేసింది. 10 నుంచి 15 ఓవర్ల మధ్యలో ఏకంగా 75 పరుగులు రాబట్టింది.
INCREDIBLE 🔥#KKRvLSG LIVE 👉 https://t.co/An81hq9kuU pic.twitter.com/u1z9wN94Bo
— ESPNcricinfo (@ESPNcricinfo) April 8, 2025