లక్నోలో కూలిన భవనం.. నలుగురు మృతి.. 20 మందికి గాయాలు

లక్నోలో కూలిన భవనం.. నలుగురు మృతి.. 20 మందికి గాయాలు

ఉత్తరప్రదేశ్లో బహుళ అంతస్తుల భవనం కుప్పకూలడంతో నలుగురు మృతిచెందారు. మరో 20 మందికి గాయాలయ్యాయి. లక్నోలోని ట్రాన్స్పోర్టు నగర్లో శనివారం ( సెప్టెంబర్​ 7) మధ్యాహ్న సమయంలో మూడంతస్తుల భవనం కుప్పకూలింది. భవనం కూలడంతో సమీపంలో పారక్ చేసి లారీ కూడా నుజ్జునుజ్జయింది.

ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలో మూడు అంతస్తుల భవనం కూలిపోయింది. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకుని శిథిలాలను తొలగిస్తున్నారు. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందారు. 15 మందిని సురక్షితంగా రక్షించారు. మరో 20  మందికి గాయాలు కావడంతో వారిని ఆస్పత్రికి తరలించారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని తరలించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అగ్నిమాపక శాఖ, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయ చర్యలు కొనసాగిస్తున్నాయి.

ALSO READ | video viral : టీచర్స్ డే సెలబ్రేషన్స్‌లో మూడో అంతస్థు పైనుంచి దూకిన విద్యార్థి.. వీడియో వైరల్

 రంగంలోకి దిగిన సహాయ బృందాలు క్షతగాత్రులను ఆసియానా ప్రాంతంలోని లోక్‌బంధు ఆస్పత్రికి తరలించారు. ఇక ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశించారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. వీలైనంత త్వరగా సహాయక చర్యలు పూర్తి చేయాలని తెలిపారు. బిల్డింగ్ కూలడానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.