నా సినిమాని తెలుగు హీరోలు రిజెక్ట్ చేశారు.. అందుకే కోలీవుడ్ కి వెళ్ళా: వెంకీ అట్లూరి

నా సినిమాని తెలుగు హీరోలు రిజెక్ట్ చేశారు.. అందుకే కోలీవుడ్ కి వెళ్ళా: వెంకీ అట్లూరి

టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ వెంకీ అట్లూరి ఈమధ్య వరుస హిట్లు అందుకుంటూ దూసుకుపోతున్నాడు. కాగా ఇటీవలే వెంకీ అట్లూరి డైరెక్షన్ లో వచ్చిన లక్కీ భాస్కర్ సినిమా సూపర్ హిట్ అయ్యింది. అంతేగాకుండా రూ.100 కోట్లు (గ్రాస్) కలెక్ట్ చేసింది. దీంతో ఈ సినిమా డైరెక్టర్ వెంకీ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అని చెప్పవచ్చు. అయితే ఇటీవలే వెంకీ అట్లూరి ఆమధ్య ధనుష్ తో తెరకెక్కించిన "వాతి" (తెలుగులో సార్) సినిమా గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

సార్ సినిమా స్టోరీని తెలుగు హీరోలకు రాశానని కానీ కథ విన్న పలువురు హీరోలు రిజెక్ట్ చేశారని తెలిపాడు. అయితే తెలుగు ఆడియన్స్, ప్రొడ్యూసర్స్ సినిమాలో హ్యాపీ ఎండింగ్ ఉండాలనుకుంటారని దీంతో సార్ సినిమాలో నటించడానికి హీరోలు ఆసక్తి చూపలేదని చెప్పుకొచ్చాడు. కథలో సోల్ లేదని, క్లైమాక్స్ బాలేదని ఇలా రకరకాల కారణాలు చెప్పి ఈ సినిమాని రిజెక్ట్ చేశారని చెప్పుకొచ్చాడు.

దీంతో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ని సంప్రదించగా కథ విని వెంటనే ఒకే చేశాడని తెలిపాడు. అయితే ఈ సినిమాని తెలుగు హీరోలు చేసుంటే రిజల్ట్ ఇంకోలా ఉండేదని కానీ ధనుష్ మాత్రం తన పాత్రకి చక్కగా న్యాయం చేశాడని అభిప్రాయం వ్యక్తం చేశాడు.

Also Read : ఈ వారం OTT లో రిలీజ్ కానున్న సినిమాలు ఇవే

ఈ విషయం ఇలా ఉండగా సార్ సినిమా లైఫ్ లో ఎడ్యుకేషన్ ఎంత ముఖ్యం, అలాగే పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమేననే కాన్సెప్ట్ తో తెరకెక్కించారు. ఈ సినిమాని ఆడియన్స్ ని బాగానే ఆకట్టుకుంది. అలాగే వరల్డ్ వైడ్ రూ.118 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ సినిమాలో మలయాళీ బ్యూటిఫుల్ హీరోయిన్ సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. సముద్రఖని, సాయికుమార్, రాజేంద్రన్, కెన్ కరుణాస్, ప్రవీణా, తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు.