అక్టోబర్ 31 న లక్కీ భాస్కర్.. బ్యాంక్ ఉద్యోగి అకౌంట్ లో కోట్లు ఎలా వచ్చాయి..?

అక్టోబర్ 31 న లక్కీ భాస్కర్.. బ్యాంక్ ఉద్యోగి అకౌంట్ లో కోట్లు ఎలా వచ్చాయి..?

ప్రముఖ తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరి లక్కీ భాస్కర్ అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో హీరోగా మలయాళీ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటిస్తుండగా, ప్రముఖ స్టార్ హీరోయిన్ మీనాక్షీ చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది. డ్రామా థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కించగా ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.

 ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై టాలీవుడ్ ప్రముఖ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. కాగా ఇప్పటికే లక్కీ భాస్కర్ చిత్రం షూటింగ్ పూర్తీ చేసుకుని థియేటర్లలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్దంగా ఉంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పాటలు,  టీజర్ విడుదల కాగా మంచి రెస్పాన్స్ వచ్చింది. 

అయితే లక్కీ భాస్కర్ చిత్ర దర్శకుడు వెంకీ అట్లూరి మరియు నిర్మాత సూర్యదేవర నాగవంశీ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందులో భాగంగా   లక్కీ భాస్కర్ చిత్రాన్ని తెలుగుతోపాటూ హిందీ, తమిళ్, మలయాళం తదితర భాషలలో అక్టోబర్ 31న విడుదల చేస్తున్నట్లు తెలిపారు. విడుదలకి రెండు రోజుల ముందే పలు థియేటర్లలో ప్రీమియర్ షోలు కూడా ప్రసారం చేయనున్నట్లు స్పష్టం చేశారు.  

Also Read :- దసరా కానుకగా విశ్వంభర టీజర్...

అలాగే ఈ నెల 21 న ట్రైలర్ రిలీజ్ చేస్తున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. అయితే లక్కీ భాస్కర్ చిత్రంలో దుల్కర్ బ్యాంక్ ఉద్యోగి పాత్రలో నటించాడు. ఈ క్రమంలో సాధారణ బ్యాంక్ ఉద్యోగి అకౌంట్ లో ఊహించలేనంత డబ్బు ఎలా వచ్చిందనే కథాంశంతో ఆసక్తికరంగా తెరకెక్కించారు. దీంతో ఈ చిత్రం గురంచి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

  • Beta
Beta feature