Lucky Baskhar OTT: ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ సూపర్ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!

Lucky Baskhar OTT: ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ సూపర్ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!

సార్ సినిమాతో ధనుష్ (Danush)కు సూపర్ హిట్ అందించిన దర్శకుడు వెంకీ అంట్లూరి(Venky Atluri) లక్కీ భాస్కర్ (Lucky Baskhar) తో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) కి కూడా మంచి సక్సెస్ ఇచ్చాడు. 

పీరియడ్ బ్యాక్ డ్రాప్లో బ్యాంక్ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీ ఆడియన్స్ ను ఆలోచింపజేసింది. కంటెంట్ పరంగానే కాకుండా కమర్షియల్ గాను మెగా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. దీపావళి కానుకగా అక్టోబర్ 31న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ.. నెల రోజుల్లోపే ఓటీటీలోకి రాబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.

లక్కీ భాస్కర్ ఓటీటీ:

ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. అందుకు నవంబర్ 30 నుంచి స్ట్రీమింగ్ అయ్యేలా నెట్‌ఫ్లిక్స్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. అయితే, ఓటీటీ స్ట్రీమింగ్పై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. కాగా త్వరలో రావొచ్చని టాక్. ప్రస్తుతం ఈ మూవీ థియేటర్స్లో రెండు వారాలు కంప్లీట్ చేసుకుని రూ.100 కోట్ల క్లబ్లో చేరడానికి సిద్ధంగా ఉంది. 

కథేంటంటే::

ఈ మూవీ కథ 1989-92 బ్యాక్డ్రాప్లో జరుగుతూ ఉంటుంది. భాస్కర్ కుమార్ (దుల్కర్ సల్మాన్) ఒక మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఓ సాధారణ బ్యాంక్ ఉద్యోగి. క్యాషియర్‌గా పనిచేస్తూ ఉంటాడు. తనకు వచ్చే జీతంతో కుటుంబం మొత్తాన్ని నడిపించడానికి అనేక కష్టాలు పడుతూ ఉంటాడు. తన భార్య సుమతి(మీనాక్షి చౌదరి), కొడుకు కార్తీక్(రిత్విక్)లనే కాకుండా అతని తండ్రి ప్రహ్లాద్ (సర్వదమన్ బెనర్జీ)కి అనారోగ్యం.

Also Read :- వరుణ్ తేజ్ మట్కా ట్విట్టర్ రివ్యూ

అంతేకాకుండా పెళ్లీడుకొచ్చిన ఒక చెల్లి, కాలేజీలో చదువుకునే తమ్ముడు.. ఇలా తన కుటుంబ  బాధ్యతలన్ని తన మీదనే ఉంటాయి. ఈ క్రమంలో కనీసం తన భార్యను హ్యాపీగా చూసుకోవాలన్న ఆశను కూడా నెరవేర్చలేని ఆర్ధికభారంతో అప్పులు చేస్తూ జీవనం సాగిస్తుంటాడు.సుమతిని ప్రేమించి పెళ్లి చేసుకొన్నందుకు అత్తింటివారి అవమానాలతో భాస్కర్ కాలం గడుస్తుంటుంది. ఉత్తమ ఉద్యోగి అనే పేరొస్తుంది తప్ప ప్రమోషన్ మాత్రం రాదు. దాంతో కష్టపడి పనిచేసినా ప్రమోషన్ కూడా పొందలేకపోతున్నాని ఆలోచించే క్రమంలోనే..ఒక సంఘటన చూసి ఒక రోజు అనూహ్య నిర్ణయం తీసుకుంటాడు.

అదే టైంలో బ్యాంకులో అప్పు తీసుకోవడానికి వచ్చిన ఆంటోనీ(రాంకీ)తో చేతులు కలిపి..పెద్ద రిస్క్ చేస్తాడు. దాంతో ఏకంగా బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్ అవుతాడు. కోట్లకు కోట్లు సంపాదిస్తాడు. మరి భాస్కర్ చేసిన ఆ రిస్క్ ఏమిటి? ఇందులో బ్యాంక్ ఛైర్మన్ (టిను ఆనంద్), మేనేజర్(సచిన్ ఖేడ్కర్) పాత్రలు ఏమిటి? డబ్బు ఆశ అతన్ని ఎలాంటి పరిస్థితుల్లోకి నెట్టేసింది. సీబీఐ ఆఫీసర్ (సాయికుమార్) భాస్కర్పై ఎలాంటి చర్యలు తీసుకున్నాడు? చివరకి భాస్కర్ లక్కీ భాస్కర్ అయ్యాడా? లంచగొండి అయ్యాడా? అనే తదితర విషయాలు తెలియాలంటే సినిమాను చూడని వారు.. ఇప్పటికీ వెళ్లి థియేటర్లో చూడొచ్చు.. లేదంటే నెట్‌ఫ్లిక్స్లో వచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే.