సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌లో లక్కీ భాస్కర్‌‌‌‌‌‌‌‌

సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌లో లక్కీ భాస్కర్‌‌‌‌‌‌‌‌

దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కుతున్న పీరియాడిక్ డ్రామా ‘లక్కీ భాస్కర్’.  వెంకీ అట్లూరి దర్శకుడు.  సితార  ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్మెంట్స్ ఫార్యూన్ ఫోర్ సినిమాస్‌‌‌‌ బ్యానర్స్‌‌‌‌పై నాగవంశీ,  సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. సోమవారం ఈ మూవీ రిలీజ్‌‌‌‌ డేట్‌‌‌‌ను అనౌన్స్ చేశారు. సెప్టెంబర్ 7న  సినిమాను విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. 1980–90 నేపథ్యంలో అసాధారణ స్థాయికి చేరుకున్న ఒక సాధారణ బ్యాంక్ క్యాషియర్ లైఫ్‌‌‌‌ జర్నీని ఇందులో చూపించబోతున్నారు.

ఇందుకోసం ఎనభైల నాటి ముంబై నగరానికి సంబంధించిన సెట్స్ వేశారు. అప్పటి బ్యాంక్‌‌‌‌లను పోలి ఉన్న సెట్స్‌‌‌‌లో ఎక్కువ భాగం షూటింగ్ చేశారు.  ఇప్పటికే షూటింగ్ పూర్తయింది.  దుల్కర్ సల్మాన్‌‌‌‌కు జంటగా మీనాక్షి చౌదరి నటిస్తోంది. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్,  శ్రీమతి గారు పాట ఆకట్టుకున్నాయి. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో సినిమా విడుదల కానుంది.