హైదరాబాద్: కాటేదాన్ టీఎన్జీవో స్ కాలనీ మణికంఠ హిల్స్‌లో ఉన్న పయనీర్ కాన్సెప్ట్ హై స్కూల్ వద్ద స్కూల్ బస్సు బోల్తా పడింది. విద్యార్థులను ఎక్కించుకోవడం కోసం బస్సును వంపుగా ఉన్న ప్రాంతంలో డ్రైవర్ నిలిపి ఉంచాడు. స్కూల్ అయిపోగానే రోజూలానే చిన్నారులు బస్సు ఎక్కారు. బస్సు వంపులోకి మెల్లిగా కదిలి ముందు నిలిపిన కారును, విద్యుత్ స్థంభాలను ఢీ కొని పక్కకు ఒరిగిపోయింది.
ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న చిన్నారులకు స్వల్ప గాయాలయ్యాయి. పెను ప్రమాదమే తప్పింది. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదం జరిగింది. విద్యార్థులకు ఏం కాకపోవడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. అలాంటి వంపుగా ఉన్న ప్రాంతంలో బస్సును నిలిపి ఉంచినందుకు డ్రైవర్‌పై స్కూల్ యాజమాన్యం మండిపడింది. డ్రైవర్ పై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.