వాషింగ్టన్: ఎవరికైనా అదృష్టం ఒకసారే తలుపు తడుతుంది అంటారు.. కానీ ఈయనకి మాత్రం ఆరుసార్లు జాక్‌పాట్ తగిలింది. ఐదుసార్లు గెలుచుకున్న దానికంటే లేటెస్ట్‌గా తగిలిన లాటరీలో ఎక్కువ మొత్తం అందుకున్నడు. ఒకటి, రెండు కాదు ఏకంగా 2 లక్షల 50 వేల డాలర్లు.. అంటే మన కరెన్సీలో దాదాపు కోటి 82 లక్షలు సొంతం చేసుకున్నాడు. అమెరికాలోని ఇదాహో స్టేట్ మెరిడియన్ సిటీకి చెందిన బ్రియాన్ మోస్ రీసెంట్‌గా క్రాస్ వర్డ్ స్క్రాచ్ గేమ్ ఆడి, విజయం సాధించాడని లాటరీ సంస్థ వెల్లడించింది. అయితే, ఆయన గెలుచుకున్న డబ్బులను ఇదాహోలోని గవర్నమెంట్ స్కూల్స్, యూనివర్సిటీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు, తన కూతురి చదువు కోసం ఉపయోగిస్తున్నాడు. ‘గవర్నమెంట్ స్కూల్స్ డెవలప్‌మెంట్‌కు డొనేట్ చేయడం గర్వంగా ఉంది. అందుకే లాటరీ ఆడుతున్నాను’ అని బ్రియాన్ మోస్ చెప్పాడు.
For More News..