ఇవాళ(సెప్టెంబర్27).. హైదరాబాద్లో లులూ హైపర్ మాల్ ప్రారంభం

హైదరాబాద్, వెలుగు: గల్ఫ్​ దేశం యూఈఏ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే లులూ గ్రూప్ ద్వారా తెలంగాణలో నిర్మించిన మొట్టమొదటి హైపర్​మాల్ బుధవారం నుండి హైదరాబాద్​వాసులకు వెల్​కమ్​ చెప్పడానికి ముస్తాబయింది. లులూ గ్రూప్‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌, మేనేజింగ్‌‌‌‌‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌ యూసఫ్‌‌‌‌‌‌‌‌ అలీ  సమక్షంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌‌‌‌‌‌‌‌ మాల్‌‌‌‌‌‌‌‌ను ప్రారంభించనున్నారు. 

కూకట్​పల్లిలోని ఈ  మాల్ ఐదు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉందని, మాల్‌‌‌‌‌‌‌‌లోనే ఏడు రెస్టారెంట్లు, ఫుడ్ కోర్ట్, ప్లే ఏరియాలు కూడా ఉన్నాయని లులూ గ్రూప్ ఇండియా షాపింగ్ మాల్స్ డైరెక్టర్ శిబు ఫిలిప్స్ తెలిపారు.  ఈ ప్రాజెక్ట్ కోసం సంస్థ రూ. 300 కోట్లను పెట్టుబడిగా పెట్టింది.  

ఈ మాల్‌‌‌‌‌‌‌‌లో 75కి పైగా స్థానిక  అంతర్జాతీయ బ్రాండ్‌‌‌‌‌‌‌‌లను కొనుక్కోవచ్చు. అంతేగాక 1,400 మంది సీటింగ్ కెపాసిటీతో 5 -స్క్రీన్ సినిమా మరో ప్రత్యేకత. ఇక్కడ కిరాణా, ఫ్యాషన్​, హోం అప్లియెన్సెస్​, ఎలక్ట్రానిక్స్, ఐటీ, లైఫ్​స్టైల్​ ప్రొడక్టులను కొనుక్కోవచ్చు.

 విస్తరణ భాగంగా నగరంలోని మరో చోట కూడా హైపర్​మాల్​ను రెండేళ్లలోపు ఏర్పాటు చేస్తామని ఫిలిప్స్​ అన్నారు. తెలంగాణలోని చిన్న నగరాల్లో స్టోర్లు తెరిచే ఆలోచన ఉందని వివరించారు. ప్రస్తుతం తమకు దేశంలో ఆరు మాల్స్​ ఉన్నాయని, విదేశాలతో కలుపుకుంటే వీటి సంఖ్య 250కి చేరుతుందని చెప్పారు. తెలంగాణలో ఫిష్​​ ప్రాసెసింగ్​ యూనిట్​ను నెలకొల్పడంపైనా ప్రభుత్వంతో చర్చిస్తున్నామని చెప్పారు.