తెలంగాణలో లంపి స్కిన్ కలకలం

తెలంగాణలో లంపి స్కిన్ కలకలం
  • మహబూబాబాద్ జిల్లాలో పశువు మృతి
  • అలర్ట్​అయిన పశుసంవర్ధక శాఖ 

హైదరాబాద్, వెలుగు: పశువుల్లో లంపి స్కిన్ కలకలం రేపుతోంది. మహబూబాబాద్​ జిల్లాలో లంపి స్కిన్ వ్యాధి లక్షణాలతో ఓ పశువు మృతి చెందినట్టు వార్తలు రావడంతో ఇతర పశువులకు వ్యాపించకుండా పశుసంవర్ధక శాఖ అలర్ట్ అయింది. దీనిని నివారించడానికి గోట్‌‌ పాక్స్‌‌ వ్యాక్సినేషన్‌‌ ను సిద్ధం చేస్తోంది. లంపి స్కిన్‌‌ వ్యాధి తెల్ల ఆవులు, ఎద్దులకు సోకి ఇతర పశువులకు వ్యాపిస్తుంది. దోమలు, ఈగలు, తేళ్లు, ఇతర కీటకాలు కుట్టడంతో ఇది వ్యాపి చెందుతోంది. గతంలో పలు రాష్ట్రాల్లో ఈ వ్యాధితో  వందలాది పశువులు చనిపోయాయి. ఈ నేపథ్యంలో వ్యాధి వ్యాపించకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపడుతున్నారు. 

వ్యాధి లక్షణాలు

లంపి స్కిన్‌‌ సోకిన పశువుల్లో నోటి, ముక్కుల నుంచి ద్రవాలు వెలువడుతాయి.  శరీరమంతా పొక్కులు వస్తాయి. వ్యాధి సోకిన పశువుల్లో పాల ఉత్పత్తి తగ్గడంతో పాటు పశుగ్రాసం తినడానికి ఇబ్బంది పడతాయి. అధిక జ్వరం వస్తే పశువులు మరణించే అవకాశం ఉంటుంది. ఈ వ్యాధి రాకుండా పశువుల కొట్టాలను రైతులు శుభ్రంగా ఉంచుకోవాలి. క్రిమికీటకాలు, దోమలు, ఈగలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పరిసర ప్రాంతాల్లో క్రిమిసంహారక మందులను పిచికారీ చేయాలి.