చంద్రుడి దక్షిణ ప్రాంత అన్వేషణ, ఉపరితలంపై నీటిజాడ, ఇతర మూలకాల ఉనికిని అన్వేషించడానికి లూనార్ పోలార్ ఎక్స్ ప్లొరేషన్ మిషన్(ఎల్యూపీఈఎక్స్ను భారత అంతరిక్ష సంస్థ, జపాన్ ఏరోస్పేస్ ఎక్లోస్పెరేషన్ ఏజెన్సీ(జేఈఎక్స్ఏ) సంయుక్తంగా ప్రయోగించనున్నాయి. ఈ మిషన్‌ను జపాన్ హెచ్3 రాకెట్ ద్వారా ప్రయోగించనున్నారు. ఇందులో ల్యాండర్, రోవర్ ఉంటాయి. రోవర్ అభివృద్ధి నిర్వహణ బాధ్యత జాక్సా చేపట్టనుండగా, రోవర్‌ను మోసుకెళ్లే ల్యాండర్ అభివృద్ధి, నిర్వహణ బాధ్యతను ఇస్రో తీసుకుంది.
- రోవర్ తనంతట తానుగా ప్రయాణిస్తూ చంద్రుడి ఉపరితలంపై నీటి జాడలను అన్వేషించనుంది. అలాగే, డ్రిల్లింగ్ మిషన్‌తో చంద్రుడి ఉపరితలాన్ని తవ్వి మట్టి శాంపిల్స్‌ను సేకరిస్తుంది.
- రోవర్‌పై అమర్చిన పరిశీలన పరికరాలతో రెగోలిత్(చంద్రుడి ఉపరితలంపై ఉండే మట్టి) నుంచి సేకరించిన శాంపుల్స్‌ను విశ్లేషించి భూమికి సమాచారాన్ని పంపుతుంది. ఈ రోవర్ ఇస్రో, జేఏఎక్స్ఏ పరికరాలను మాత్రమే కాకుండా యూఎస్ అంతరిక్ష సంస్థ నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ(ఈఎస్ఏ) పరికరాలను కూడా తీసుకెళ్లనుంది.