ఆసియాలోనే ఫస్ట్ టైం.. చనిపోతూ కరోనా పేషెంట్‌కు ప్రాణం పోసిండు

బ్రెయిన్ డెడ్ వ్యక్తి నుంచి లంగ్ ట్రాన్స్ ప్లాంటేషన్
ఆసియాలోనే మొట్టమొదటి ప్రయత్నం
సక్సెస్‌ఫుల్‌గా పూర్తిచేసిన చెన్నై డాక్టర్లు

చెన్నై/ముంబై: అతడు కరోనా పేషెంట్.. తీవ్రమైన ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నాడు. ఇదే సమయంలో చెన్నైలో ఒక వ్యక్తి బ్రెయిన్ డెడ్. ఇద్దరూ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు . బతికే చాన్స్ ఒకరికే ఉంది. ఎందుకంటే ఇంకొకరు దాదాపు చనిపోయినట్లే. దీంతో బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి అవయవాలు దానం చేసేందుకు అతడి భార్య ఒప్పుకుంది. దీంతో వెంటనే కరోనా పేషెంట్ కు లంగ్స్ ట్రాన్స్ ప్లాంట్ చేశారు డాక్టర్లు. అక్కడ ఊపిరి ఆగింది.. ఇక్కడ ఊపిరి నిలిచింది.. అటు విషాదం.. ఇటు ఆనందం.. ఇంట్రాసెరెబ్రల్ హేమరేజ్ వల్ల పేషెంట్(34) బ్రెయిన్ డెడ్ అయినట్లు చెన్నైలోని గ్లెనెగల్స్ గ్లోబల్ హాస్పిటల్ డాక్టర్లు గురువారం ప్రకటించారు. అవయవాలను దానం చేసేందుకు అతడి భార్య ఒప్పుకున్నారు . లివర్, లంగ్స్, హార్ట్, కిడ్నీలు, స్కిన్ ను ఎంజీఎం హెల్త్ కేర్ డాక్టర్లు సేకరించారు. మరోవైపు ఢిల్లీకి చెందిన 48 ఏళ్ల వ్యక్తి జూన్ 8న కరోనా బారిన పడ్డాడు. దీంతో అతడి ఊపిరితిత్తులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. లంగ్స్ లోని కొంత భాగం మాత్రమే పని చేస్తోంది. పరిస్థితి విషమించడంతో జులై 20న అతడిని ఘజియాబాద్ నుంచి చెన్నైకి తీసుకొచ్చారు. రోజురోజుకూ పరిస్థితి విషమిస్తూ వచ్చింది. చెన్నైలోనే ఒకరు బ్రెయిన్ డెడ్ అయ్యారని తెలిసి.. ఈ నెల 27న లంగ్స్ ట్రాన్స్ ప్లాంట్ చేశారు. ఆపరేషన్ సక్సెస్ అయింది. కరోనాసోకిన పేషెంట్ కు లంగ్ ట్రాన్స్ ప్లాంట్ చేయడం ఆసియాలోనే తొలిసారి. మరోవైపు బ్రెయిన్ డెడ్ వ్యక్తి చేతులను ముంబైకి చెందిన మౌనిక మోరేకు అతికించారు. అక్కడా ఆపరే
షన్ సక్సెస్ అయిందని డాక్లర్లు చెప్పారు.

For More News..

ఇండియా-పాక్ బార్డర్లో భారీ సొరంగం