లుపిన్​ మందుకు ఎఫ్‌‌డీఏ ఆమోదం

లుపిన్​ మందుకు ఎఫ్‌‌డీఏ ఆమోదం

న్యూఢిల్లీ:  అమెరికాలో జెనరిక్ హైపర్‌‌టెన్షన్ డ్రగ్‌‌ను మార్కెట్ చేయడానికి యూఎస్ హెల్త్ రెగ్యులేటర్ నుంచి అనుమతి పొందినట్లు ఫార్మా కంపెనీ లుపిన్ ఆదివారం తెలిపింది.   ప్రొప్రానోలోల్ హైడ్రోక్లోరైడ్ ఎక్సెటెండ్  ​రిలీజ్​ మాత్రలకు యూఎస్​ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్  నుంచి కంపెనీ ఆమోదం దక్కించుకుందని రెగ్యులేటరీ ఫైలింగ్‌‌లో పేర్కొంది. కంపెనీ ఉత్పత్తి ఏఎన్​ఐ ఫార్మాస్యూటికల్స్  ఇండరల్ ఎల్​ఏ  క్యాప్సూల్స్​కు జెనరిక్​ వెర్షన్. దీనిని కంపెనీ పీతాంపూర్‌‌లోని  ప్లాంట్‌‌లో తయారు చేయనున్నట్లు లుపిన్​ పేర్కొంది.