SA20: నాలుగు ఓవర్లలో 72 పరుగులా.. సూపర్ కింగ్స్‌ను ముంచిన ఒకే ఒక్కడు

SA20: నాలుగు ఓవర్లలో 72 పరుగులా.. సూపర్ కింగ్స్‌ను ముంచిన ఒకే ఒక్కడు

సౌతాఫ్రికా టీ20 లీగ్ లో జోబర్గ్ సూపర్ కింగ్స్ కథ ముగిసింది. ఎలిమినేటర్ మ్యాచ్ లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ చేతిలో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించింది. బుధవారం (ఫిబ్రవరి 5) జరిగిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ పై 34 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్ లో జోబర్గ్ సూపర్ కింగ్స్ ఓటమికి ఒకడే కారణమయ్యాడు. టోర్నీ మొత్తం అద్భుతంగా బౌలింగ్ చేసిన ఫాస్ట్ బౌలర్ లుథో సిపామ్లా ఎలిమినేటర్ మ్యాచ్ లో సూపర్ కింగ్స్ తరపున విలన్ గా మారాడు. 

నాలుగు ఓవర్లలో ఏకంగా 72 పరుగులు సమర్పించుకొని జట్టు ఓటమికి కారణమయ్యాడు. జట్టులో మిగతా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసినప్పటికీ సిపామ్లాను సన్ రైజర్స్ చితక్కొట్టారు. తొలి ఓవర్లోనే 12 పరుగులు సమర్పించుకున్న అతను ఆ తర్వాత తన రెండు ఓవర్లలో వరుసగా 21,11 పరుగులు సమ్పర్పించుకున్నాడు. సిపామ్లా వేసిన ఇన్నింగ్స్ 19 ఓవర్లో మార్కో జాన్సెన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. దీంతో ఈ ఓవర్ లో ఏకంగా 29 పరుగులు వచ్చాయి. 

Also Read : అంతర్జాతీయ క్రికెట్‪లో అరుదైన ఘనత

ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. కెప్టెన్ మార్కరం 62 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. 184 పరుగులో తన నాలుగు ఓవర్లలో సిపామ్లా 72 పరుగులు ఇవ్వగా.. మిగిలిన బౌలర్లు 16 ఓవర్లు వేసి 112 పరుగులు ఇచ్చారు. లక్ష్య ఛేదనలో జోబర్గ్ సూపర్ కింగ్స్ 7 వికెట్ల నష్టానికి 152 పరుగులకే పరిమితమైంది.  సిపామ్లా బౌలింగ్ ఒక్కటే సూపర్ కింగ్స్ ఓటమికి కారణమని ఫ్యాన్స్ తమ నిరాశను వ్యక్తం చేస్తున్నారు.