లక్సెట్టిపేట మున్సిపాలిటీకి అచీవ్​మెంట్ అవార్డు

లక్సెట్టిపేట మున్సిపాలిటీకి అచీవ్​మెంట్ అవార్డు

లక్సెట్టిపేట/కోల్ బెల్ట్, వెలుగు: లక్సెట్టిపేట మున్సిపాలిటీ 2024–25 ఆర్థిక సంవత్సరానికి గానూ రూ.కోటి 46 లక్షలు ప్రాపర్టీ టాక్స్ వసూలు చేసి ఉమ్మడి జిల్లాలో టాప్​గా నిలిచిన నేపథ్యంలో అచీవర్స్ సర్టిఫికెట్ అందజేశారు. ప్రాపర్టీ టాక్స్ పన్ను వసూళ్లలో లక్సెట్టిపేట మున్సిపాలిటీ 86.55 శాతం వసూలు చేసినందుకు గానూ సీడీఎంఏ ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్​లో  ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ టీకే శ్రీదేవి చేతుల మీదుగా మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ సర్టిఫికెట్ అందుకున్నారు.

మందమర్రి మున్సిపాలిటీకి కూడా..

77.35 శాతం ప్రాపర్టీ టాక్స్ ​వసూలు చేసిన మందమర్రి మున్సిపాలిటీకి కూడా అవార్డు దక్కింది. మున్సిపల్ కమిషనర్ తుంగపిండి రాజలింగును సన్మానించి అవార్డు అందజేశారు.