హైదరాబాద్లో సిటీలో లగ్జరీ ఇండ్ల సేల్స్​ జోరు

న్యూఢిల్లీ: లగ్జరీ ఇండ్ల అమ్మకాలలో హైదరాబాద్​ సిటీ దూసుకెళ్తోంది. రూ. 4 కోట్లకు మించి విలువున్న లగ్జరీ ఇండ్ల కొనుగోలు సిటీలో జోరందుకుని ఏకంగా 20 రెట్లు పెరిగినట్లు ఒక రిపోర్టు వెల్లడించింది. ఈ ఏడాది ఏప్రిల్​–జూన్​ మధ్య కాలంలో సిటీలో ఇలాంటి మొత్తం 1,000 ఇండ్లు విక్రయమైనట్లు తెలిపింది. అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో లగ్జరీ ఇండ్ల అమ్మకాలు కేవలం 50 యూనిట్లు మాత్రమే కావడం గమనించాలి. ఇక దేశంలోని ఏడు ప్రధాన సిటీలలోను కలిపి ఏప్రిల్​– జూన్​ మధ్య కాలంలో రూ. 4 కోట్లపైన విలువుండే 3,100 లగ్జరీ ఇండ్లు విక్రయమైనట్లు సీబీఆర్​ఈ రిపోర్టు వెల్లడించింది. 

ALSO READ:లేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రొటెక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిటీ ... ఏం చేస్తున్నది? : హైకోర్టు

అంతకు ముందు ఏడాది ఇదే కాలానికి చూస్తే ఈ అమ్మకాలు 1,400 యూనిట్లు మాత్రమేనని పేర్కొంది. ఢిల్లీ–ఎన్​సీఆర్​ ప్రాంతంలో లగ్జరీ ఇండ్ల అమ్మకాలు మూడు రెట్లు పెరిగి 1,050 యూనిట్లకు చేరాయి. పుణెలో అమ్మకాలు 150 యూనిట్లకు పెరగ్గా, చెన్నై, కోల్​కతా సిటీలలో కిందటేడాదిలాగే 50 యూనిట్లకు పరిమితమైనట్లు సీబీఆర్​ఈ ఈ రిపోర్టులో తెలిపింది. రెండో క్వార్టర్లో ముంబై సిటీలో లగ్జరీ ఇండ్ల సేల్స్​  750 యూనిట్లకు తగ్గిపోయాయి. బెంగళూరు సిటీలోనూ లగ్జరీ ఇండ్ల డిమాండ్​ సగానికి పడిపోయింది. ఈ సిటీలో కేవలం 50 లగ్జరీ ఇండ్లు అమ్ముడుపోయాయి. ‌‌‌

2023 మిగిలిన ఆరు నెలల్లో రెసిడెన్షియల్​  మార్కెట్​ జోరు పెరుగుతుంది. సప్లయ్ పైప్​లైన్ మెరుగ్గా ఉండటంతోపాటు, ఫెస్టివల్​ సీజన్​ కావడంతో సేల్స్​ పెరుగుతాయి. 

- సీబీఆర్​ఈ సీఈఓ అన్షుమన్​ మాగజైన్