లైఫియస్ ఫార్మా ప్లాంట్‌‌‌‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ

లైఫియస్ ఫార్మా ప్లాంట్‌‌‌‌ను  ప్రారంభించిన ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: అరబిందో ఫార్మాకు చెందిన లైఫియస్ ఫార్మా ఆంధ్రప్రదేశ్‌‌‌‌లోని కాకినాడలో నిర్మించిన పెన్సిలిన్–-జి ప్లాంట్‌‌‌‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. దీనికి ఏటా15 వేల   టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం ఉంటుంది. 

 పీఎల్​ఐ పథకం కింద కంపెనీ రూ. 2,500 కోట్ల పెట్టుబడి పెడుతుంది.   ఫార్మాస్యూటికల్ రంగానికి సంబంధించిన పీఎల్​ఐ పథకం కీలకమైన కేఎస్​ఎంలు, డీఏఐలు, ఏపీఐలలో దేశీయ తయారీ సామర్థ్యాలను బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుందని ప్రభుత్వం తెలిపింది.