రెండై ఉన్న ప్రాణాలే.. ఒకటయ్యాయిలా

రెండై ఉన్న ప్రాణాలే.. ఒకటయ్యాయిలా

చరణ్ సాయి, ఉషశ్రీ జంటగా ఎం మణికంఠ  దర్శకత్వంలో  సురేష్ అనపురపు, బస్వ గోవర్థన్ గౌడ్ నిర్మిస్తున్న చిత్రం ‘ఇట్స్ ఓకే గురు’. శనివారం ఈ సినిమా నుంచి  ‘నిలవదే నిలవదే..’ అనే  లిరికల్ సాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేశారు. 

మోహిత్ రెహ్మానియక్ సాంగ్  కంపోజ్ చేయగా..  లక్ష్మీ ప్రియాంక   లిరిక్స్ రాశారు. సిద్ధార్థ్ మీనన్ పాడిన తీరు  ఆకట్టుకుంది. ‘నిలవదే నిలవదే .. ఎదురుగా నా మది.. తపన తెరచాటులో.. తగని ఆరాటమే, రెండై ఉన్న ప్రాణాలే ఒకటయ్యాయిలా, నీతో ఉన్న కాలాలే మధురమే...’ అంటూ మంచి లవ్ ఫీల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో సాగుతుందీ పాట.  

సుధాకర్ కోమాకుల ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తవగా, త్వరలోనే రిలీజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డేట్ అనౌన్స్ చేయనున్నారు.