Lyricist Anantha Sriram: ప్రభాస్ కల్కి మూవీకి.. రచయిత అనంత్ శ్రీరామ్ వార్నింగ్

Lyricist Anantha Sriram: ప్రభాస్ కల్కి మూవీకి.. రచయిత అనంత్ శ్రీరామ్ వార్నింగ్

సినిమాల్లో హైందవ ధర్మం మీద దాడి జరుగుతోందని ప్రముఖ టాలీవుడ్ సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్‌ (Anantha Sriram) ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్కి2898AD మేకర్స్ తీసిన ఈ మూవీపై అనంత శ్రీరామ్ తనదైన శైలిలో విరుచుకుపడుతూ చేసిన వ్యాఖ్యలు ఇపుడు సంచలనం రేపుతోన్నాయి. అసలేం జరిగింది.. అనంత శ్రీరామ్ ఎందుకిలా మాట్లాడాల్సి వచ్చిందనే పూర్తి వివరాలు చూద్దాం.. 

విజయవాడలో ఆదివారం (జనవరి 5న) జరిగిన హైందవ శంఖారావం సభలో పాటల రచయిత ‍అనంత శ్రీరామ్ పాల్గొన్నారు. కేసరపల్లి వద్ద జరిగిన విశ్వ హిందూపరిషత్‌ (VHP) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సభకు భారీ సంఖ్యలో జనం వచ్చారు.

ఈ సందర్బంగా ‍అనంత శ్రీరామ్ మాట్లాడుతూ.. ' ప్రస్తుతం సినిమాల్లో హైందవ ధర్మంపై దాడి జరుగుతోంది. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ప్రభాస్ కల్కి మూవీలో కర్ణుడి పాత్రను హీరోగా చూపించడం సిగ్గు చేటుగా ఉందని అన్నాడు. కర్ణుడి పాత్రను హైలెట్ చేయడం చేయడం చూసి సినిమా ఇండస్ట్రీ వ్యక్తిగా నేను సిగ్గుపడుతున్నా.. జరిగిన పొరపాటును పొరపాటు అని చెప్పకపోతే ఈ హైందవ ధర్మంలో మనం పుట్టినట్టు కాదని అన్నారు.ఈ ధర్మాన్ని ఆచరించినట్టు కాదు. ఒక హిందువుగా ప్రకటించుకోవడం వ్యర్థం అని చెబుతున్న.  

Also Read : ప్రముఖ స్టార్ హీరోకి బ్రెయిన్‌ సర్జరీ

అలాగే కర్ణుడ్ని వీరుడు, శూరుడు అంటూ చూపడం ఏంటని.. ఆగ్రహం వ్యక్తం చేశాడు. అగ్ని దేవుడిచ్చిన ధనస్సును పట్టిన అర్జునుడి కంటే.. సూర్యుడిచ్చిన ధనస్సును పట్టిన కర్ణుడు వీరుడు? అని ఎలా చెబుతారని ప్రశ్నించాడు. నిండు సభలో ద్రౌపది వస్త్రాన్ని తీస్తున్నా మౌనంగా ఉన్న కర్ణుడు ఎలా గొప్పవాడు అవుతాడు? ఇలా రామాయణ, మహా భారతాలకు ఎప్పటి నుంచో.. సినిమా వక్రీకరణలోనూ, చిత్రకరణలోనూ అన్యాయం జరుగుతుంటే ఇలానే చూస్తూ ఎలా ఉంటాం. ఇక అప్పటి చిత్ర దర్శకులు.. ఇప్పుడు సినిమా తీసిన నిర్మాతలు ఇదే కృష్ణా జిల్లాకు చెందినవారైనా సరే నిర్మొహమాటంగా చెబుతున్నా అన్నారు.

సమకాలీన సమాజంలో చలన చిత్రం అనేది ఒక ముఖద్వారముగా మారింది. అయితే, వచ్చిన చిక్కల్లా ఎందనేది అనంత శ్రీరామ్ చెబుతూ.. " ఇపుడు సినిమా రంగం.. హిందూసమాజానికి కళంకం కలిగిస్తుందనే విషయాన్నీ అందరిముందు చెబుతున్న.

ఇప్పటిదాకా యావత్ హైందవ ధర్మ హిందూ సమాజానికి జరిగిన అన్యాయానికి.. సినిమా ఇండస్ట్రీ తరుపున క్షమాపణలు చెబుతున్నాని చెప్పారు. ప్రస్తుతం రచయిత అనంత శ్రీరామ్ మాట్లాడిన ఈ మాటలిపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఈ వ్యాఖ్యలపై కల్కి చిత్ర మేకర్స్ ఎలా స్పందిస్తారో తెలియాల్సి ఉంది.