సినీ గేయ రచయిత చంద్రబోస్ కు మాతృవియోగం

సినీ గేయ రచయిత చంద్రబోస్ తల్లి కన్నుమూశారు. సోమవారం ఉదయం వారి తల్లి మదనమ్మ గుండెపోటుతో హైదరాబాద్ లో కన్నుమూశారు. వీరి స్వస్థలం వరంగల్ జిల్లా చిట్యాల మండలంలోని చల్లగిరి గ్రామం. స్వగ్రామంలోనే అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

నరసయ్య, మదనమ్మ దంపతులకు నలుగురు సంతానం. వీరిలో చంద్రబోస్  చిన్నవాడు. తన చిన్నతనాన తల్లి మదనమ్మతో కలిసి ఒగ్గు కథలు, చిందు భాగవతాలు చూసేవాడినని పలు వేదికలపై చంద్రబోస్ తెలిపారు. ఈ స్పూర్తే తనను పాటలు రాసేలా ప్రేరేపించిందని చెప్పారు.