Chandrabose: చల్లగరిగలో ఆస్కార్ గ్రంథాలయం ప్రారంభోత్సవం..సొంతూరు కోసం మంచి మనస్సు చాటుకున్న చంద్రబోస్..

Chandrabose: చల్లగరిగలో ఆస్కార్ గ్రంథాలయం ప్రారంభోత్సవం..సొంతూరు కోసం మంచి మనస్సు చాటుకున్న చంద్రబోస్..

ప్రముఖ సినీ గేయరచయిత చంద్రబోస్(Chandrabose) కేవలం సినిమాలకు పాటలు రాసే కవి అనే దానికంటే..సరస్వతి పుత్రుడు అనడం ఉత్తమం. చంద్రబోస్ రాసిన తెలుగు పాటకు తెలుగు ఇండస్ట్రీలోని అవార్డుల మొదలు..ప్రపంచ స్థాయి అవార్డులైన గోల్డెన్ గ్లోబ్, ఆస్కార్ అకాడమీ అవార్డులు రావడం తెలుగు సినీ పరిశ్రమకు గర్వకారణంగా చెప్పవచ్చు. 

తాజా విషయానికి వస్తే..కనుకుంట్ల చంద్రబోస్..స్వస్థలమైన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని చల్లగరిగ గ్రామంలో ఆస్కార్‌ గ్రంథాలయాన్ని నిర్మించాడు. గురువారం (జూలై 4న) భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, చంద్రబోస్‌ చేతుల మీదుగా ఈ ఆస్కార్‌ గ్రంథాలయాన్ని ప్రారంభించారు. ఆసార్‌ అవార్డుకు తీపిగుర్తుగా రూ.36 లక్షల వ్యయంతో భవనాన్ని నిర్మించి ఆస్కార్‌ గ్రంథాలయం అని నామకరణం చేశారు. రెండంతస్తులతో నిర్మించిన ఈ గ్రంథాలయ భవన నిర్మాణం దాదాపు అంత పూర్తయి, అన్ని హంగులతో చాలా చక్కగా రూపుదిద్దుకుంది.

తెలుగు సినీ పరిశ్రమకు అన్ని రకాలైన పాటలతో..తనదైన అక్షరాలా సంపుటితో మరుపురాని పాటలు అందించాడు చంద్రబోస్.ఎంత ఎదిగినా తాను పుట్టిన ఊరిపై ఉన్న ప్రేమను ఇలా ఆస్కార్‌ గ్రంథాలయంతో చాటుకున్నాడు. ఈ కార్యక్రమానికి చంద్రబోస్‌ మిత్రులు, సినీ ప్రముఖులు,రాజకీయా నాయకులు హాజరరయ్యారు.ఈ ఆస్కార్‌ గ్రంథాలయంలోని పుస్తకాలూ చదివి ప్రతి ఒక్కరు..ఒక చంద్రబోస్ కావాలని ఊరంతా ఆశిస్తున్నారు.

‘గ్రామస్థులకు ఇచ్చిన మాట ప్రకారం సరస్వతి గుడిని నిర్మించా. చాలా సంతోషంగా ఉంది’ అని ఆనందం వ్యక్తం చేశారు చంద్రబోస్. చల్లగరిగలోని తమ ఇంటి పక్కన ఉన్న గ్రంథాలయంలో ఎన్నో సాహిత్య పుస్తకాలు చదివానని, వాటి వల్లే తాను ఉన్నతస్థాయికి ఎదిగానని బోస్ ఈ సందర్బంగా గుర్తు చేసుకున్నారు.