మందమర్రి సింగరేణి జీఎంగా మనోహర్​ బాధ్యతలు 

కోల్​బెల్ట్, వెలుగు : మందమర్రి ఏరియా సింగరేణి నూతన జీఎంగా ఎం.మనోహర్​ సోమవారం బాధ్యతలు చేపట్టారు. స్థానిక జీఎం ఆఫీస్​లో పూజలు చేసిన అనంతరం ఆయన బాధ్యతలు స్వీకరించగా.. ఏరియాలోని అండర్ ​గ్రౌండ్ మైన్లు, ఓసీపీ, డిపార్ట్​మెంట్ల బాధ్యులు బొకేలు అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ మందమర్రి ఏరియాలో ఈ ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి, ఉత్పదకతను సాధించేందుకు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

స్ట్రక్చర్​ ట్రైనింగ్​ క్లాసులు ప్రారంభం

మందమర్రిలోని సింగరేణి ఎంవీటీసీ కేంద్రంలో ఫ్రంట్​లైన్​ సూపర్ ​వైజర్లకు ఐదేండ్లకు ఒక్కసారి నిర్వహించే స్ట్రక్చర్​ ట్రైనింగ్​ క్లాసులను సోమవారం నూతన జీఎం మనోహర్​ ప్రారంభించారు. రక్షణతో బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకత సాధించడానికి ఫ్రంట్​లైన్​ సూపర్​వైజర్లకు 12 రోజుల పాటు నిర్వహించే ట్రైనింగ్​క్లాసులు దోహదపడుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఏస్వోటు జీఎం రాజేశ్వర్​రెడ్డి, బెల్లంపల్లి రీజియన్ సేఫ్టీ​జీఎం కేఎస్ గుప్తా, ఆఫీసర్స్​ అసోసియేషన్ ప్రెసిడెంట్​ పైడీశ్వర్, కేకే ఓసీపీ, ఆర్కేపీ ఓసీపీ పీవోలు రమేశ్, గోవిందరావు, శాంతిఖని ప్రాజెక్ట్ ఆఫీసర్ విజయప్రసాద్​తదితరులు పాల్గొన్నారు.