లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ డైరెక్టర్ గా ఎం.మోహన్

లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ డైరెక్టర్ గా ఎం.మోహన్

తిరువనంతపురం: లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్ (ఎల్ పీఎస్ సీ) డైరెక్టర్ గా ఎం.మోహన్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (వీఎస్ఎస్ సీ) (ప్రాజెక్ట్స్) డైరెక్టర్ గా పని చేస్తున్నారు. ఈ మేరకు ఇస్రో చైర్మన్ ఓ ప్రకటన విడుదల చేశారు. గతంలో ఆయన హ్యుమన్ స్పేస్ ప్లైట్ సెంటర్ డైరెక్టర్, వీఎస్ఎస్ సీ (ఆర్ అండ్ డీ) అసోసియేట్ డైరెక్టర్, వీఎస్ఎస్ సీ (ఎమ్ఎమ్ ఈ) డిప్యూటీ డైరెక్టర్, వీఎస్ఎస్ సీ (ఎఎస్ఓఈ) డిప్యూటీ డైరెక్టర్ తో సహా ఇతర కీలక పదవులను నిర్వహించారు.

జీఎస్ఎల్ వీ ప్రోగ్రామ్ ప్రాజెక్ట్ డైరెక్టర్, జీఎస్ఎల్ వీఎఫ్08/జీశాట్ 6ఏ, జీఎస్ఎల్ వీఎఫ్ 11/జీశాట్ 7ఏ మిషన్ డైరెక్టర్ గా పని చేశారు. మోహన్ కేరళలోని అలప్పుజకు చెందినవారు. ఆయన సాధించిన విజయాలకు 2016లో ఇస్రో పెర్ఫార్మెన్స్ ఎక్సలెన్స్ అవార్డు, 2010లో ఇస్రో మెరిట్ అవార్డు లభించాయి. మోహన్ ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియాలో ఫెలో మెంబర్. సొసైటీ ఆఫ్ ఏరోస్పేస్ మాన్యుఫ్యాక్చరింగ్ ఇంజినీర్స్ తో సహా ఇతర సంస్థల్లో జీవితకాల సభ్యుడు.