కామారెడ్డి ఎస్పీగా  రాజేశ్​చంద్ర

కామారెడ్డి ఎస్పీగా  రాజేశ్​చంద్ర

కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి ఎస్పీగా ఎం. రాజేశ్​చంద్రను నియమిస్తూ శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2015 ఐపీఎస్​ బ్యాచ్​కు చెందిన ఆయన ప్రస్తుతం  రాచకొండ  పోలీస్​ కమిషనరేట్ పరిధిలోని యాదాద్రి భువనగిరి డీసీపీగా పని చేస్తున్నారు.  ఇక్కడ ఎప్పీగా పని చేస్తున్న  సింధూశర్మ ఇంటలిజెన్స్ ఎస్పీగా బదిలీ అయ్యారు.  సింధూశర్మ 2022 అక్టోబర్​లో ఇక్కడకు బదిలీపై వచ్చారు. జిల్లాలో ఏడాదిన్నర పాటు పని చేశారు.