కిర్గిజిస్తాన్ లోని స్టూడెంట్లకు ఇబ్బందుల్లేవ్ : ఎం.రామారావు

కిర్గిజిస్తాన్ లోని స్టూడెంట్లకు ఇబ్బందుల్లేవ్ : ఎం.రామారావు
  • తల్లిదండ్రులు ఆందోళన చెందొద్దు
  • ఇంటర్నేషనల్​ హయ్యర్​ స్కూల్ ఆఫ్ మెడిసిన్ ఎండీ

ఖైరతాబాద్, వెలుగు: మెడిసిన్​చదివేందుకు కిర్గిజిస్తాన్​వెళ్లిన స్టూడెంట్లకు ఎలాంటి ఇబ్బందులు లేవని, తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఇంటర్నేషనల్ హయ్యర్ స్కూల్​ఆఫ్​మెడిసిన్​మేనేజింగ్ డైరెక్టర్ ఎం.రామారావు తెలిపారు. గురువారం ఆయన సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో మీడియాతో మాట్లాడారు. కిర్గిజిస్తాన్ రాజధాని బిష్​కెక్​లో అరేబియన్​దేశాల వారు స్థిరపడ్డారని, ఆ ప్రాంతంలో మే13న ఈజిప్టు స్టూడెంట్లపై దాడి జరిగిందని తెలిపారు.

అయితే విదేశీ విద్యార్థులపై దాడి జరిగిందంటూ సోషల్​మీడియాలో ఫేక్​న్యూస్​ప్రచారం చేశారని చెప్పారు. ఇండియన్​స్టూడెంట్లకు ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు. సమావేశంలో డాక్టర్ భానుప్రకాశ్, కిర్గిజిస్తాన్​ఫ్యాకల్టీలు డాక్టర్ అజిజా అజిబెకోవా, సిటోర జకిరోవ, నాగేశ్వరరరావు పాల్గొన్నారు.