గురుకుల విద్యార్థినికి అండగా సీఎం రేవంత్

గురుకుల విద్యార్థినికి అండగా సీఎం రేవంత్
  • ప్రభుత్వ ఖర్చుతో కార్తీకకు నిమ్స్​లో ట్రీట్మెంట్

హైదరాబాద్, వెలుగు: గురుకుల స్కూల్ బిల్డింగ్ పైనుంచి కిందపడి తీవ్రగాయాలపాలైన విద్యార్థిని కొయ్యడ కార్తీకకు సీఎం రేవంత్ రెడ్డి అండగా నిలిచారు. ప్రభుత్వ ఖర్చుతో వైద్యం అందించాలని సీఎంఓ అధికారులను ఆదేశిం చారు. సీఎం సూచన మేరకు నిమ్స్​లో కార్తీకకు డాక్టర్లు ఆపరేషన్ నిర్వహించారు. ప్రస్తుతం కార్తీక కోలుకుంటోంది. ములుగు జిల్లా కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షే మ గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువు తున్న కార్తీక.. ఈ నెల 9న ప్రమాదవశాత్తు స్కూల్ మూడో అంతస్తు నుంచి పడిపోయింది. 

దీంతో విద్యార్థిని నడుము భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. గురుకుల అధికారులు కార్తీకను వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి, అక్కడి నుంచి నిమ్స్​కు తరలించారు.నిమ్స న్యూరో సర్జన్ అసిస్టెంట్ ఫ్రొఫెసర్​ తిరుమల్ బృందం కార్తీకకు మంగళవారం ఆపరేషన్ నిర్వహించింది. ప్రస్తుతం ఐసీయులో విద్యార్థిని కోలుకుంటున్నట్లు డాక్టర్లు తెలిపారు. కార్తీక వైద్య ఖర్చులను పూర్తిగా ప్రభుత్వమే భరించనున్నది. సీతక్క కూడా కార్తీక ఆరోగ్య పరిస్థితిపైన ఎప్పటికప్పుడు నిమ్స్ డాక్టర్లను అడిగి తెలుసుకుంటున్నారు.