హనుమకొండ సిటీ, వెలుగు: వరంగల్ ఆర్టీసీ డిపోలో పనిచేస్తూ కొంతకాలం క్రితం విద్యుత్ షాక్ తో మృతి చెందిన ఎం.సంపత్ కుమార్ కుటుంబానికి రూ.కోటి బీమా చెక్కును శనివారం రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వి.సి. సజ్జనార్ అందజేశారు.
హైదరాబాద్ ఆర్టీసీ కల్యాణ మండపంలో చెక్కును అందించారు. కార్యక్రమంలో సంపత్ కుమార్ కుటుంబ సభ్యులు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ జోనల్ హెడ్స్ ఎం.అరుణ్ కుమార్, రీజినల్ హెడ్స్ పలుగుల సత్యం, ఎగ్జిక్యూటివ్డైరెక్టర్లు, సీఎఫ్ వో పాల్గొన్నారు.