హైదరాబాద్, వెలుగు: తమ బ్రాండ్ 2019లో ఎం సిరీస్ ఫోన్లను లాంచ్ చేసినప్పటి నుంచి కొన్ని కోట్ల ఫోన్లు అమ్ముడయ్యాయని శామ్సంగ్ మొబైల్బిజినెస్ డైరెక్టర్ వరుణ్ సచ్‌దేవా అన్నారు. వీటికి డిమాండ్ రోజురోజుకూ పెరుగుతూనే ఉందని చెప్పారు. హైదరాబాద్‌లో బుధవారం ఎం14 5జీ ఫోన్‌ను లాంచ్ చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. క్వాలిటీ కెమెరా, డిస్ప్లే, వేగంగా పని చేసే ప్రాసెసర్, ఎక్కువ సేపు పనిచేసే బ్యాటరీ, 5జీ, సెక్యూరిటీ బాగుండటం వల్ల వీటికి ఆదరణ బాగుందని అన్నారు.
ఎం సిరీస్ ఫోన్ల ధరలు రూ.10 వేల నుంచి రూ.20 వేల మధ్య ఉండటం వల్ల యూత్ ఎక్కువగా వీటిని కొంటున్నారని వివరించారు. ఈ సెగ్మెంట్లో తమ కంపెనీ ఇండియాలో మార్కెట్లీడర్ అని, 5జీ డివైజ్‌ల అమ్మకాల్లోనూ మొదటి స్థానమని అన్నారు. ఈ క్యాలెండర్ సంవత్సరంలో ఇప్పటి వరకు తొమ్మిది 5జీ మోడల్స్‌ను లాంచ్ చేశామని వరుణ్ వివరించారు. దేశంలో 1,700, తెలంగాణలో వంద ఎక్స్‌క్లూజివ్ స్టోర్లను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.