- ఈసీఐఎల్‌లోని శ్రీకర హాస్పిటల్లో ఘటన
మల్కాజిగిరి, వెలుగు: హాస్పిటల్లో ట్రీట్మెంట్ వికటించి ఎంటెక్ విద్యార్థిని మృతి చెందింది. తుర్కపల్లి మండలం మాదాపూర్‌కు చెందిన నిఖిత(23) ఎంటెక్ చదువుతోంది. గురువారం కాలేజీ నుంచి వచ్చిన తర్వాత ఆమెకు ఛాతిలో నొప్పి రావడంతో తల్లిదండ్రులు ఈసీఐఎల్‌లోని శ్రీకర హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. గురువారం రాత్రి వైద్యులు అడ్మిట్ చేసుకొని ట్రీట్మెంట్ ఇచ్చారు.
శుక్రవారం ఉదయం తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి, మీ అమ్మాయికు ఎలాంటి ఆరోగ్య సమస్య లేదని, సాయంత్రం డిశ్చార్జి చేస్తామని చెప్పారు. కాసేటికే యువతి మృతి చెందడంతో హాస్పిటల్ఎదుట బంధువులు ఆందోళనకు దిగారు. వైద్యం వికటించే తమ కూతురు మృతి చెందిందని, శ్రీకర హాస్పిటల్‌ను సీజ్ చేయాలని డిమాండ్‌చేశారు. విషయం తెలుసుకున్న కుషాయిగూడ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.