సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగాఎంఏ బేబీ

సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగాఎంఏ బేబీ
  • 85 మందితో కేంద్ర కమిటీ ఎన్నిక
  • 18 మందితో కొత్త పొలిట్ బ్యూరో
  • ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుంచి 11 మందికి చోటు
  • పొలిట్ బ్యూరోలో ఇద్దరు, కేంద్ర కమిటీ సభ్యులుగా 9 మందికి చాన్స్
  • మధురైలో ముగిసిన జాతీయ మహాసభలు

హైదరాబాద్​, వెలుగు: సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేరళ మాజీ మంత్రి ఎంఏ బేబీ ఎన్నికయ్యారు. తమిళనాడులోని మధురైలో నిర్వహించిన 24వ సీపీఎం జాతీయ మహాసభలు ఆదివారంతో ముగిశాయి. ఈ మేరకు 85 మంది సభ్యులతో కేంద్ర నూతన కమిటీని ఎన్నుకున్నారు. కొత్త కేంద్ర కమిటీ సభ్యులంతా ఏకగ్రీవంగా పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎంఏ బేబీని ఎలెక్ట్ చేశారు. గతేడాది సీతారాం ఏచూరి చనిపోయారు. నాటి నుంచి ప్రధాన కార్యదర్శి పదవి ఖాళీగా ఉన్నది. పార్టీ తాత్కాలిక సమన్వయకర్తగా సీనియర్ నేత ప్రకాశ్ కారత్ వ్యవహరించారు. 

తాజాగా కేంద్ర కమిటీతో పాటు జాతీయ ప్రధాన కార్యదర్శిని ఎన్నుకున్నారు. అదేవిధంగా, 18 మందితో కొత్త పొలిట్ బ్యూరో ఎన్నికవ్వగా.. తెలుగు రాష్ట్రాల నుంచి ఇద్దరికి అవకాశం కల్పించారు. పొలిట్ బ్యూరో సభ్యులుగా బీవీ రాఘవులు, ఆర్.అరుణ్ కుమార్ ఎన్నికయ్యారు. కేంద్ర కమిటీలోనూ 9 మందికి చోటు దక్కింది. కేంద్ర కమిటీ సభ్యులుగా కే.హేమలత, జాన్ వెస్లీ, ఎస్.వీరయ్య, ఎం.సాయిబాబా, టి.జ్యోతి, తమ్మినేని వీరభద్రం, శ్రీనివాసరావు, లోకనాథం, రమాదేవి ఎన్నికయ్యారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కేంద్ర కమిటీలో 20 శాతం మంది మహిళలకు చోటు కల్పించారు.

అంచెలంచెలుగా ఎదిగి.. 

కేరళలోని కొల్లాం జిల్లా ప్రక్కులాంలో ఎంఏ బేబీ జన్మించారు. కేరళ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఐ)తో ఆయన రాజకీయ జీవితం ప్రారంభమైంది. ఆ తర్వాత పార్టీ యూత్ వింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డీవైఎఫ్ఐలో పనిచేశారు. 1986 నుంచి 1998 వరకు సీపీఎం రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఎమర్జెన్సీ కాలంలో స్టూడెంట్లను, యువతను సమీకరించి జైలుశిక్ష కూడా అనుభవించారు. 2006లో కేరళలోని కుందర నుంచి తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. 

2006 నుంచి 2011 వరకు వీఎస్ అచ్యుతానంద్ మంత్రివర్గంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. 2011లో  కుందర నియోజకవర్గం నుంచే తిరిగి గెలుపొందారు. 2012 నుంచి సీపీఎం పొలిట్ బ్యూరో‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కొనసాగుతున్నారు. కాగా, 2014 లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సభ ఎన్నికల్లో కొల్లాం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అంచెలంచెలుగా జాతీయ కార్యదర్శి స్థాయికి ఎదిగారు.