Paris olympics 2024: ఆరు గోల్డ్ మెడల్స్ తో మా లాంగ్‌‌‌‌‌‌‌‌ కొత్త చరిత్ర

Paris olympics 2024: ఆరు గోల్డ్ మెడల్స్ తో మా లాంగ్‌‌‌‌‌‌‌‌  కొత్త చరిత్ర
  • చైనా టీటీ లెజెండ్ మా లాంగ్ కొత్త చరిత్ర

పారిస్‌‌‌‌‌‌‌‌: చైనా టేబుల్ టెన్నిస్ లెజెండ్ మా లాంగ్‌‌‌‌‌‌‌‌ ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌లో ఆరు స్వర్ణ పతకాలతో  కొత్త చరిత్ర సృష్టించాడు. విశ్వ క్రీడల్లో అత్యధిక స్వర్ణాలు సాధించిన చైనా ప్లేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా రికార్డుకెక్కాడు. చైనా మెన్స్‌‌‌‌‌‌‌‌ టీటీ టీమ్‌‌‌‌‌‌‌‌కు గోల్డ్ మెడల్ అందించడంతో అతను ఈ రికార్డును ఖాతాలో వేసుకున్నారు. ఫైనల్లో చైనా .. స్వీడన్‌‌‌‌‌‌‌‌ను ఓడించి టీమ్‌‌‌‌‌‌‌‌ ఈ వెంట్‌‌‌‌‌‌‌‌లో వరుసగా ఐదోసారి ఒలింపిక్ చాంపియన్‌‌‌‌‌‌‌‌గా నిలిచింది.

ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌లో మా లాంగ్‌‌‌‌‌‌‌‌కు ఇది ఆరోస్వర్ణం. దాంతో మెగా గేమ్స్‌‌‌‌‌‌‌‌లో అత్యంత విజయవంతమైన టీటీ ప్లేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నిలిచాడు. 35 ఏండ్ల మా 2012 లండన్ గేమ్స్‌‌‌‌‌‌‌‌ నుంచి ప్రతీ ఎడిషన్‌‌‌‌‌‌‌‌లోనూ కనీసం ఒక గోల్డ్ గెలుస్తూ వస్తున్నాడు. ఇక, టీటీ టీమ్‌‌‌‌‌‌‌‌ ఈవెంట్‌‌‌‌‌‌‌‌లో నాలుగు బంగారు పతకాలు గెలిచిన ఏకైక ప్లేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అతనే కావడం విశేషం. పారిస్‌‌‌‌‌‌‌‌, టోక్యో, రియో, లండన్‌‌‌‌‌‌‌‌ ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌లో అతను చైనా జట్టుకు స్వర్ణ పతకాలు అందించాడు. కాగా, పారిస్ గేమ్స్‌‌‌‌‌‌‌‌ తనకు  చివరి ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌ అని మా లాంగ్ ప్రకటించాడు.