రిలీజ్ కి 2 రోజుల ముందే మా నాన్న సూపర్ హీరో సినిమా ప్రీమియర్ షోలు.

రిలీజ్ కి 2 రోజుల ముందే మా నాన్న సూపర్ హీరో సినిమా ప్రీమియర్ షోలు.

తెలుగులో ప్రముఖ స్టార్ హీరో సుధీర్ బాబు ప్రస్తుతం మా నాన్న సూపర్ హీరో అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రంలో సాయాజీ షిండే మరియు సాయి చంద్ ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. తండ్రి సెంటిమెంట్ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇటీవలే  మా నాన్న సూపర్ హీరో చిత్ర ట్రైలర్ విడుదల కాగా మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో  చిత్ర యూనిట్ మంచి కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. 

Also Read :- బిగ్బాస్ హౌస్‌లో జంతువుల హింస ఎందుకు..?

అయితే మా నాన్న సూపర్ హీరో చిత్రం విజయదశమి కానుకగా అక్టోబర్ 11న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించారు. కానీ రెండు రోజుల ముందే ప్రీమియర్‌ల షోలని ప్లాన్ చేసింది. ఇందులో భాగంగా ఈరోజు నుంచి హైదరాబాద్ (పీవీఆర్ కూకట్పల్లి), వైజాగ్ (సంగం థియేటర్), విజయవాడ (రాజ్ యువరాజ్ థియేటర్) మరియు రాజమండ్రి (సూర్య కాంప్లెక్స్) తదితర  ప్రాంతాల్లో ప్రీమియర్ షోలు వేయనున్నారు. ఇప్పటికే టికెట్లు హౌజ్ ఫుల్ అయ్యాయి. దీంతో మరిన్ని షోలు పెంచుతామని చిత్ర యూనిట్ సోషల్ మీడియా వేదికగా తెలిపింది.

సుధీర్  బాబుకి మంచి టాలెంట్ ఉన్నప్పటికీ కథల విషయంలో సరైన నిర్ణయం తీసుకోలేకపోవడంతో గత కొన్నేళ్లుగా హిట్ లేక ఇబ్బంది పడుతున్నాడు. దీంతో మా నాన్న సూపర్ హీరో చిత్రంతో సక్సెస్ లభించాలని అభిమానులు కోరుకుంటున్నారు.