
నిహాన్, వైష్ణవి కాంబ్లే జంటగా రవి బాసర రూపొందించిన చిత్రం ‘మా ఊరి రాజారెడ్డి’. రజిత రవీందర్, సునీత వెంకటరమణ నిర్మించారు. మార్చి 1న సినిమా విడుదలకానుంది. ఈ సందర్భంగా ఆదివారం నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు మాజీ మంత్రి వేణుగోపాల చారి ముఖ్య అతిథిగా హాజరై సినిమా విజయం సాధించాలని కోరారు.
తమకు అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు నిహాన్, వైష్ణవి థ్యాంక్స్ చెప్పారు. నిర్మల్ చుట్టు పక్కల ప్రాంతాల్లో ఈ మూవీ షూటింగ్ చేశామని, విజువల్స్ అందర్నీ ఆకట్టుకుంటాయని, ఇది పక్కా లోకల్ సినిమా అని దర్శక నిర్మాతలు చెప్పారు. మూవీ టీమ్ అంతా కార్యక్రమంలో పాల్గొన్నారు.