
రెండు కత్తులైనా ఒక ఓరలో ఇమడతాయేమో కానీ.. రెండు కొప్పులు ఒకచోట చేరితే కుదురుగా ఉండవని చాలామంది అంటుంటారు. చిన్న చిన్న విషయాలను కూడా పెద్దవి చేసి గొడవ పడే ఆడాళ్ళను ఉద్దేశించి ఈ మాట అంటుంటారు. ఊళ్లలో వీధి కొళాయిల దగ్గర ఆడాళ్ళు గొడవపడటం ఆనవాయితీగా ఉండేది అప్పట్లో... నోయిడాలో జరిగిన ఈ ఘటన వీధి కొళాయిల దగ్గర గొడవ మించిపోయే రేంజ్ లో ఉంది. ఓ గేటెడ్ కమ్యూనిటీలో మహిళ ఇంకో మహిళ జుట్టు పట్టుకొని ఈడ్చుతూ కొట్టిన ఘటన నోయిడాలో చోటు చేసుకుంది. ఇందుకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. చూస్తుంటేనే భయంకరంగా ఉన్న ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి.
నోయిడాలోని సెక్టార్ 168లో ఉన్న పారాస్ సీజన్ సొసైటీలో జరిగింది ఈ ఘటన. ఓ మహిళ మరో మహిళ జుట్టు పట్టుకొని ఈడ్చి కొడుతూ.. ఈమె నా తల్లిని తిట్టింది.. పోలీసులను పిలవండి అంటూ గట్టిగా అరుస్తోంది. చుట్టూ ఉన్న జనం ఆపాలని చూసినా కూడా వాళ్ళను ఏ మాత్రం లెక్క చేయకుండా తిడుతూ.. కొట్టడానికి ప్రయత్నించింది. దీంతో చేసేదేమీ లేక చూస్తూ ఉండిపోయారు జనం. ఈ ఘటన కారణంగా అక్కడి వాతావరణం కాసేపు వేడెక్కింది.
नोएडा के सेक्टर-168 की Paras Seasons सोसाइटी में दो महिलाओं के बीच मारपीट का वीडियो वायरल।pic.twitter.com/zxHA2PGIOv
— Greater Noida West (@GreaterNoidaW) April 12, 2025
రెండు రోజుల క్రితం ఇద్దరు మహిళలకు వాట్సాప్ కాల్ లో జరిగిన సంభాషణే ఈ గొడవకు కారణమని తెలుస్తోంది. మొత్తానికి ఒక వాట్సాప్ కాల్ ఇద్దరు మహిళల మధ్య ఒక యుద్ధానికే కారణమైందని కామెంట్ చేస్తున్నారు నెటిజన్స్.