తండ్రీ కొడుకుల ఎమోషన్​తో.. 'మా నాన్న సూపర్ హీరో' టీజర్

తండ్రీ కొడుకుల ఎమోషన్​తో.. 'మా నాన్న సూపర్ హీరో' టీజర్

సుధీర్ బాబు, ఆర్ణ జంటగా అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో  సునీల్ బలుసు నిర్మిస్తున్న చిత్రం ‘మా నాన్న సూపర్ హీరో’.  అక్టోబర్ 11న సినిమా విడుదల కానుంది.  గురువారం హీరో నాని సోషల్ మీడియా ద్వారా టీజర్‌‌‌‌‌‌‌‌ను  రిలీజ్ చేసి టీమ్‌‌‌‌కు బెస్ట్ విషెస్ చెప్పాడు.  తండ్రిని అమితంగా ప్రేమించే కొడుకు పాత్రలో సుధీర్ బాబు కూల్‌‌‌‌గా కనిపించాడు. సాయాజీ షిండే, సాయి చంద్ విభిన్న పాత్రలలో ఆకట్టుకున్నారు. తన తండ్రితో సుధీర్ బాబుకు ఉన్న  డీప్ ఎమోషనల్ బాండ్‌‌‌‌ని చూపిస్తూ కట్ చేసిన టీజర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచింది. 

టీజర్ లాంచ్ ఈవెంట్‌‌‌‌లో సుధీర్ బాబు మాట్లాడుతూ ‘ఈ సందర్భంగా నాకు లైఫ్ ఇచ్చిన మా నాన్న పోసాని నాగేశ్వరరావుకు థ్యాంక్స్ చెబుతున్నా. మాకు గొప్ప జీవితాన్ని ఇవ్వడానికి నాన్న అహర్నిశలు కష్టపడేవారు. నాన్న గురించి ఎంత చెప్పినా సరిపోదు. ఇద్దరు సూపర్ హీరోల మధ్య జరిగే లవ్ స్టోరీ ఇది. నా కెరీర్‌‌‌‌‌‌‌‌లో అత్యంత సంతృప్తిని ఇచ్చిన సినిమా’ అని చెప్పాడు.  

‘మై ఫాదర్ ఈజ్ మై సూపర్ హీరో. చాలా మంచి ఎమోషన్ ఉన్న సినిమా ఇది’ అని ఆర్ణ చెప్పింది.  అభిలాష్ మాట్లాడుతూ ‘ఫాదర్ అండ్ సన్ మధ్య జరిగే బ్యూటీఫుల్ స్టోరీ ఇది. హార్ట్ వార్మింగ్ సినిమా అవుతుంది’ అని చెప్పాడు. ఈ సినిమా చేసినందుకు గర్వంగా ఉందని నటులు సాయాజీ షిండే, శశాంక్, మ్యూజిక్ డైరెక్టర్ జై క్రిష్ అన్నారు.