
2021 కరోనా సమయంలో డైరెక్ట్ ఓటీటీలో విడుదలై అనూహ్యమైన విజయాన్ని సాధించిన సినిమా మా ఊరి పొలిమేర(Maa Oori Polimera). అనిల్ విశ్వనాథ్(Anil vishwanath) దర్శకత్వంలో సత్యం రాజేష్(Sathyam Rajesh), బాలాదిత్య(Baladithya), గెటప్ శ్రీను(Getup srinu) ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఆ సమయంలోనే ఈ సినిమాకు సీక్వెల్ ప్రకటించారు మేకర్స్. దీంతో చాలాకాలంగా ఈ సీక్వెల్ కోసం ఎదురుచూస్తున్నారు ఆడియన్స్. దాదాపు రెండు సంవత్సరాల తరువాత మా ఊరి పొలిమేర(Maa Oori Polimera) నేడు(నవంబర్ 3) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎంతో ఆసక్తిగా సినిమాను చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని పంచుకుంటున్నారు. మరి సినిమా ఎలా ఉంది? ఆడియన్స్ ఏమంటున్నారు? ఈ సీక్వెల్ అంచనాలను అందుకుందా? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
Also Read :- కీడా కోలా మూవీ ఎలా ఉంది?
మా ఊరి పొలిమేర 2 సినిమాకు ఆడియన్స్ నుండి మిక్సుడ్ టాక్ వస్తోంది. కొంతమంది సినిమా నెక్స్ట్ లెవల్లో ఉంది అంటూ కామెంట్స్ చేస్తుంటే.. మరికొందరేమో అంచనాలను అందుకోలేదని అంటున్నారు. ఇంకొందరు.. సినిమాలో ట్విస్టులు మైండ్ బ్లాక్ అని, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సినిమాను నిలబెట్టిందని, చేతబడి నేపధ్యంలో వచ్చే సీన్స్ ప్రేక్షకుల వెన్నులో వణుకుపుట్టిస్తాయని చెబుతుంటే.. సినిమా ముగింపు సరిగాలేదని, మూడో పార్ట్ కూడా ఉంటుందని చెప్పి ఓపెన్ ఎండింగ్ ఇవ్వడం అనేది అసంపూర్తిగా ఉందని చెప్తున్నారు. ఇక ఓవరాల్ గా సినిమాకు ఆడియన్స్ నుండి మిక్సుడ్ టాక్ వస్తోంది.